భలే ఛాన్సులే - జగన్ ను నిలదీసిన చంద్రబాబు

May 26, 2020

పోలవరంపై వేసిన కేసులో జగన్ కు తలకొట్టేసినట్లయ్యిందన్న విషయం తెలిసిందే. హైడల్ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌ను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నవయుగ చేసిన వాదనతో కొత్త విషయం బయటకు వచ్చింది. జగన్ కు అవినీతి కారణం చూపి టెండర్లు రద్దు చేసే అవకాశమే లేకపోవడంతో... విచిత్రమైన కారణంతో నవయుగ కాంట్రాక్టును రద్దు చేసిన విషయం తెలుసుకుని కోర్టే ఆశ్చర్యపోయింది. ఒక ప్రభుత్వ సంస్థ చేసిన తప్పు వల్ల నవయుగ సంస్థకు నష్టం జరిగితే... నవయుగ వల్ల ఏపీ పనులు ఆగిపోయాయని రివర్స్ కారణం చెప్పి జగన్ నవయుగకు బ్రేకులు వేశారు. అయితే... గట్టి సాక్ష్యాలతో నవయుగ వాదించడంతో జగన్ బుక్కయ్యిపోయాడు. దీంతో కోర్టు తీర్పుపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

పోలవరం ప్రాజెక్టు ఏపీకి గుండె అని, దానిపై ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెప్పినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, సీఎం జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రివర్స్ టెండర్ల వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు జగన్ లాభం చేయకపోగా నష్టం ఎక్కువ చేస్తున్నారని బాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో జరగని అవినీతిని ఎలా వెతికితీయగలరని ప్రశ్నించారు. స్వయంగా కేంద్రమంత్రే టెండర్ల రద్దు వద్దని గడ్కరీ ఎన్నోసార్లు చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ ది అవగాహన రాహిత్యం అని, ప్రాజెక్టు విషయంలో ఒక్కసారి న్యాయవివాదం మొదలైతే ఆ ప్రభావం మొత్తం ప్రాజెక్టుపై పడుతుందని హెచ్చరించిన వినలేదన్నారు. పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుందని బాబు నిలదీశారు. ప్రభుత్వానికి పిచ్చి పట్టిందా? రాష్ట్రానికి పట్టిన శని పట్టింది అనుకోవాలా ? అని తీవ్రస్థాయిలో విమర్శించారు.