ఛాన్సు దొరికింది... చంద్రబాబు వాయించాడు

July 08, 2020

అధికారం మీద తప్ప దేవుడి మీద ప్రేమ లేదు

పవర్ మీద తప్ప మహాత్ముడి మీద ప్రేమ పుట్టదు

మోడీని పొగిడితే దేశభక్తి.

మోడీని తిడితే దేశద్రోహి.

దేశంలో ఇలాంటి వికృత క్రీడను ఆడుతున్న పైశాచిక రాజకీయంపై ఈరోజు చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ దేశం మహాత్ముడిగా భావించి పూజించే గాంధీని చంపిన వాడిని పొగిడి... దేశ స్వాతంత్రం తన జీవిత కాలం అంకితమైన గాంధీని చంపిన వాడిని దేశభక్తుడిగా కీర్తించిన బీజేపీ అరాచకంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.

తాాజాగా బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ నాథూరామ్ గాడ్సే ని గొప్ప దేశభక్తుడిగా కీర్తించింది. ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా బీజేపీపై ఆందోళనను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో చేసేది లేక పరోక్షంగా సారీ చెప్పారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తన ప్రతినిధి ద్వారా చెప్పించారు. ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు స్పందించారు. "మొదట మహారాష్ట్ర పోలీసు అధికారి హేమంత్ కర్కరేను దూషించారు. ఆయన ఇప్పుడు లేరు కూడా. ఇప్పుడు జాతిపిత మహాత్ముడిపై పడ్డారు. అహింసాదూత, ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అయిన మహాత్మా గాంధీపైనే విమర్శలు చేస్తున్నారు. ఇదేనా మీరు చెబుతున్న గుజరాత్ మోడల్? ఈ సందేశాన్నే భారతదేశమంతా వ్యాప్తి చేయాలనుకుంటున్నారా?" అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
మరో ట్వీట్ లో జాతిపితను చంపినవారిని గొప్ప దేశభక్తులుగా బీజేపీ నాయకులు కీర్తించడం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోంది. బీజేపీకి చెందిన నేతలే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇలాంటి వారికి మద్దతుగా నిలవడం చూస్తుంటే వారి దేశభక్తి ఏంటో అర్థమవుతోంది’’ అని చంద్రబాబు విమర్శించారు.
అధికారం దక్కించుకోవడానికి అన్ని రకాల అడ్డదారులు తొక్కుతున్న బీజేపీపై దేశంలో దాదాపు అన్ని పార్టీలు దారుణంగా తప్పుపడుతున్నాయి. సామాన్య ప్రజల్లో బీజేపీ మళ్లీ వస్తే చాలా ప్రమాదం అనే అభిప్రాయం ఏర్పడింది.