ఈవీఎం మొరాయింపులపై చంద్రబాబు ఫైర్

July 09, 2020

ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో భారీ బందోబస్తు నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం ఓటర్లను అసంతృత్తికి గురి చేస్తోంది. దీనిపై కొద్దిసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్ అవుతూ రియాక్ట్ అయ్యారు.

కొద్దిసేపటి క్రితమే కుటుంబ సమేతంగా వెళ్లి ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు కాసేపు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈవీఎంలు మొరాయించడంపై స్పందిస్తూ.. తాము ఈవీఎంలు వద్దని ఎప్పటినుంచో మొత్తుకుంటున్నామని, ఈవీఎంలు దుర్వినియోగమయ్యే ఛాన్సులున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. బ్యాలెట్‌తో ఏ సమస్యా ఉండదని ముందుగానే చెప్పినా వినలేదని ఆయన అన్నారు. ఈవీఎంల వల్ల నష్టాన్ని ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఈవీఎంలపై రివిజన్ పిటిషన్ వేసే విషయంపై ఆలోచిస్తున్నామని బాబు తెలిపారు.