అమెరికా వీధుల్లో ఉల్లాసంగా బాబు

August 06, 2020

వైద్య పరీక్షల కోసం సతీమణితో పాటు అమెరికా వెళ్లిన చంద్రబాబు చాలా సంవత్సరాల తర్వాత విశ్రాంతిగా గడిపారు. మిన్నెసోటాలోని రాచెస్టర్ నగరంలో ఉన్న మేయో క్లినిక్ లో పరీక్షల అనంతరం చంద్రబాబు ఉల్లాసంగా భార్య భువనేశ్వరితో కలిసి కాఫీ షాపు, రెస్టారెంట్లలో కాసేపు కాలక్షేపం చేశారు. పలువురు ఎన్నారైలు చంద్రబాబును అనుసరించారు.
అమెరికా వీధుల్లో చంద్ర‌బాబు సరదాగా పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. అక్కడ ఉన్న అనేక మంది ఎన్నారైలు బాబును ఆసక్తిగా తిలకించారు. చాలామందికి చంద్రబాబును ఇలా రిలాక్స్ గా చూసిన సందర్భాలు గుర్తులేవు. ప్రతిపక్షంలో, అధికారంలో ఎలా ఉన్నా ఏదో ఒకపనిలో బిజీగా ఉండటం చంద్రబాబుకు అలవాటు. అందుకే బాబు ఇలా సరదాగా గడపడం అందరికీ కొత్త అనిపిస్తోంది.
ఇదిలా ఉండగా... ప్రముఖ ఎన్నారైలు జయరాం కోమటి, సతీష్ వేమన, శ్రీనివాస్ కోనేరు, రామ్‌ చౌదరి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమెరికా వీధుల్లో తిరుగుతూ స్ట్రీట్ షాపింగ్ ను పరిశీలించారు. పాప్ కార్న్ తింటూ వారితో ముచ్చట్లు చెప్పారు. ఆయనను గుర్తుపట్టిన పలువురు ఎన్నారైలు విష్ చేయడం కనిపించింది. నిన్నటితో తన పర్యటన ముగించుకున్న చంద్రబాబు అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరారు. రేపు తెల్లవారుజాము 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబు దిగనున్నారు.