ప్రతిపక్షంలో ఉన్నా సీఎం కంటే అప్ డేటెడ్ గా ఉన్న చంద్రబాబు

June 03, 2020

జనవరి 1న కేవలం 266 మందికి మాత్రమే కరోనా సోకిందని, ఈ రోజుకు అది ఐదున్నర లక్షలకు చేరుకుందని చెప్పారు. అలాగే, జనవరి 11న మొదటి మరణం చోటు చేసుకోగా, ఈ రోజు 25వేలమంది వరకు చనిపోయినట్లు వెల్లడించారు. అమెరికాలో నిన్నటికి 85వేల కేసులకు చేరుకున్నాయని, మృతుల సంఖ్య 13 వందల మందికి పైగా చనిపోయారన్నారు. నిన్న ఒక్కరోజే 274 మంది చనిపోయినట్లు చెప్పారు. ఇటలీలో 80వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, 8వేల మందికి పైగా మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. నిన్న ఒక్కరోజే 712 మంది చనిపోయారన్నారు. స్పెయిన్‌లో 57,789 మందికి ఈ మహమ్మారి సోకిందని, 4365 మంది మృతి చెందారని, నిన్న ఒక్కరోజే ఏడువందల మందికి పైగా చనిపోయారన్నారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే..

- ఈ మహమ్మారి 196 దేశాలకు వ్యాప్తించింది. మరింతగా విజృంభించే పరిస్థితి ఉంది.

- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రిన్స్ చార్లెస్‌కు కూడా ఈ వ్యాది సోకింది.

- మన దేశంలో ఉదయానికి 775 మందికి సోకింది. (రాత్రికి ఇది 874 మందికి సోకింది. 

- ఇండియాలో ఈ రోజు 147 కేసులు కొత్తగా వచ్చాయి. 19 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే 7గురు చనిపోయారు.

- కొన్ని దేశాలు దీనిని నియంత్రించింది. చైనా పక్కన ఉన్న హాంగ్‌కాంగ్ బాగా నియంత్రించింది. ఇక్కడ 518 మందికి ఈ వ్యాధి సోకింది.64 నిన్న పెరిగాయి. 4గురు మాత్రమే చనిపోయారు.

- సింగపూర్‌లో 683 మందికి వచ్చింది. కొత్తగా 52 మందికి వచ్చింది. ఇద్దరు మాత్రమే చనిపోయారు.

- తైవాన్‌లో కూడా 267 మందికి వచ్చింది. నిన్న 32 కేసులు నమోదు కాగా, ఇద్దరు మాత్రమే చనిపోయారు.

- ఈ దేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశాల్లో తీసుకునే చర్యలతో చాలా వరకు నియంత్రించారు.

ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వస్తే అది రోజు రోజుకు పెరుగుతుందని ఈ వ్యాధి పుట్టిన జోహుజియానావాంగ్ (వూహాన్‌లోని) గవర్నర్ చెప్పారు. ఒక వ్యక్తికి ఈ వ్యాధి వస్తే ఆరో రోజుకు 3200 మందికి వ్యాప్తించే అవకాశముందని అతను చెప్పారు. అదే సమయంలో అష్టదిగ్బంధం వల్ల ఇది 500కు తగ్గుతుంది. 17 మరణాలు వస్తాయి. 69 శాతం తగ్గుతుందని చెప్పారు.

- సోషల్ డిస్టెన్స్ ద్వారా ఇది తగ్గుతుంది. ప్రధాని మోడీ చెప్పిన సోషల్ డిస్టెన్స్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి. 

- హ్యూమన్ టచ్ వల్ల ఇది విపరీతంగా పెరుగుతుంది. ఫిజికల్ డిస్టెన్స్ తగ్గించుకోవాలి.

- చాలామంది రికవరీ అవుతున్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. 

- చనిపోయేవారిలో మగవారు 4.7 శాతం ఉన్నారు. ఆడవారు 2.8 శాతం ఉన్నారు.

- వయస్సును బట్టి కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది.

- 80 ఏళ్లకు పైగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శాతం వారే చనిపోయారు. 70-80 సంవత్సరాల వారు 8 శాతం ఉన్నారు. 60-70 ఏళ్ల వారు 3 శాతం ఉన్నారు. 50-59 ఏళ్ల వారు 1.3 శాతం, 40-50 ఏళ్ల మధ్యవారు 1.4 శాతం, 10-40 ఏళ్ల మధ్య వారు 0.2 శాతం మాత్రమే మృత్యువాత పడ్డారు. 

- యువతకు రెసిస్టెన్స్ కెపాసిటీ ఉంటే ఇది అటాక్ అవుతుంది. ఇబ్బంది పెడుతుంది. కానీ ఎక్కువగా మరణం ఉండదు.

- పదేళ్లలోపు చనిపోయిన దాఖలాలు లేవు.

- ఆరోగ్యం బాగాలేని వారికి దాని వల్ల ఇబ్బందులు.

- గుండె సమస్య ఉన్న వారిలో 10.5 శాతం కేసులు నమోదయ్యాయి. అంటే వందమంది చనిపోతే 10.5 శాతం గుండె సమస్య ఉన్నవారు.

- డయాబెటిస్ ఉంటే 7.3 శాతం, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటే 6.3 శాతం, హైపర్ టెన్షన్ ఉంటే 6 శాతం, క్యాన్సర్ ఉంటే 5.6 శాతం ఉంది. 

- ఒక వ్యక్తికి టచ్ చేసుకుంటూ పోతే 6వ రోజుకు 3200 మందికి వస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. ఇలా లక్షలమందికి వ్యాధి సోకుతుంది.

- ఈ వైరస్‌కు ఇప్పటి వరకు మందులు లేవు. కావాల్సింది స్వయం నియంత్రణ.

- ప్రధాని మోడీ చెప్పినట్లుగా నియంత్రణలో ఉండాలి.