ఏపీలో బాబు గెలుపు ఎలానో చెప్పిన ఆయన చెప్పాడు

July 21, 2019

ఇవాల్టిరోజున మీడియా అధినేత ప్రతి వారం క్రమం తప్పకుండా రాజకీయ విశ్లేషణ చేసే వారు ఎవరైనా కనిపిస్తారా? అంటే.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఒక్కరే కనిపిస్తారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఆయన్ను చెబుతుంటారు. టీడీపీకి దన్నుగా ఆయన మీడియా సంస్థ నిలుస్తుందన్న అభిప్రాయాన్ని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో ముగిసిన ఎన్నికలపై పలు వర్గాల్లో వినిపిస్తున్న జగన్ కాబోయే సీఎం మాటకు ఆర్కే ఎలా కౌంటర్ ఇస్తారు? ఏపీలో జరిగిన ఎన్నికలు చంద్రబాబుకు ఎందుకు అనుకూలంగా ఉండనున్నాయి? లాంటి సందేహాలకు ఆర్కే తన తాజా కాలమ్ లో సమాధానం చెప్పేశారు.
జగన్ కాబోయే ఏపీ సీఎం అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూనే.. బాబు గెలుపు అవకాశాల్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. బాబు గెలుపుపై ఆయన వినిపిస్తున్న వాదనను చూస్తే.. టీడీపీ అధినేత.. ఆ పార్టీ వర్గాలు ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారో తెలుస్తుందని చెప్పక తప్పదు. గెలుపుపై బాబు బ్యాచ్ ధీమా వెనకున్న కారణాల్ని ఆర్కే మాటల్లోనే చూస్తే..

తెలంగాణలో అమలు చేసిన రైతుబంధు, పింఛన్లు వంటి పథకాలకే కేసీఆర్‌కు అద్భుత విజయం దక్కిందని గ్రహించిన చంద్రబాబు తన బుర్రకు పదునుపెట్టారు. ఫలితంగా పింఛన్లను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచడంతోపాటు డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వంతున పసుపు–కుంకుమ కింద అందజేశారు. ఈ రెండు పథకాల ద్వారా లబ్ధిపొందినవారి సంఖ్య కోటిన్నరగా ఉంది. తాజా ఎన్నికలలో ఈ రెండు పథకాల ప్రభావం కూడా అధికంగా కనపడింది.


* తెలంగాణలో రైతుబంధు పథకానికి ఎంతటి ప్రచారం లభించిందో ఆంధ్రప్రదేశ్‌లో పసుపు–కుంకుమ పథకానికి కూడా అంతటి ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులతోపాటు, రాష్ట్రానికి ఏదో కీడు జరగబోతోందని భావించిన వర్గాలన్నీ చంద్రబాబువైపు చేరినట్టుగా ఓటింగ్‌ సరళిని బట్టి స్పష్టమవుతోంది.
* తాను ఓడిపోతే పోలవరం నిర్మాణం, రాజధాని అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు చేసిన ప్రచారం కూడా ప్రజలను ప్రభావితం చేసింది. తాను అధికారంలోకి వస్తే పోలవరం, రాజధాని నిర్మాణం అంతకంటే వేగంగా చేస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెప్పుకోలేకపోయారు. చంద్రబాబుకంటే మంచి పాలన, సమర్థ పాలన తాను ఎలా అందిస్తానో వివరించడంలో జగన్‌ ఆసక్తిచూపలేదు. ‘ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి’ అని కలవరించడమేగానీ తటస్థులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలను జగన్మోహన్‌ రెడ్డి చేయలేదు. అలాంటప్పుడు, ఇప్పటికే సంక్షేమ ఫలాలను అందుకుంటున్న వారికి ‘ఎవరో అధికారంలోకి వస్తే ఇంకేదో జరుగుతుందన్న ప్రచారంపై ఆసక్తి ఎందుకు ఉంటుంది?’
* గతానికి భిన్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాబు.. చివరలో శిరస్సు వంచి మరీ ప్రజలను అండగా నిలబడమని అర్థించారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
* వైసీపీ తరఫున విజయలక్ష్మి, షర్మిల ఎన్నికల ప్రచారం చేపట్టగా... తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు ఒక్కరే అంతా తానై నిలిచారు. దీంతో జగన్మోహన్‌ రెడ్డి కోరుకున్నట్టుగా ‘ఒక్క చాన్స్‌ ఇద్దాం’ అనుకున్నవారు ఒకవైపు, ‘రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అని భావించినవారు మరోవైపు మోహరించారు.
* జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా రెడ్డి సామాజికవర్గం సంఘటితమై జగన్మోహన్‌ రెడ్డి వెనుక నిలబడగా, కమ్మ సామాజికవర్గంతోపాటు తటస్థులంతా చంద్రబాబుకు అండగా నిలబడ్డారు. ఫలితంగా ఎన్నికల పోరు పరాకాష్ఠకు చేరడంతోపాటు పంతాలు– పట్టింపులు కూడా ఇరువర్గాలలో పెరిగాయి.
* చంద్రబాబుపై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న దాడిని రాష్ట్రంపై జరుగుతున్న దాడిగా విద్యావంతులు, తటస్థులు భావించడం మొదలెట్టారు. పోలింగ్‌ ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా ఈ వర్గం ఓటర్లు మాత్రం ఉదయం ఆరు గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. రాబోయే ఫలితాలకు ఇదొక సంకేతం! తెలంగాణ ప్రజలు తమ తీర్పు ద్వారా చంద్రబాబుకు జ్ఞానోపదేశం చేశారు.
* తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికలలో కేసీఆర్‌ను దీవిస్తూ ప్రజలెందుకు తీర్పు ఇచ్చారో చంద్రబాబుకు స్పష్టంగా బోధపడింది. తెలంగాణలో అమలు చేసిన రైతుబంధు, పింఛన్లు వంటి పథకాలకే కేసీఆర్‌కు అద్భుత విజయం దక్కిందని గ్రహించిన చంద్రబాబు తన బుర్రకు పదునుపెట్టారు. ఫలితంగా పింఛన్లను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచడంతోపాటు డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు వంతున పసుపు–కుంకుమ కింద అందజేశారు. ఈ రెండు పథకాల ద్వారా లబ్ధిపొందినవారి సంఖ్య కోటిన్నరగా ఉంది. తాజా ఎన్నికలలో ఈ రెండు పథకాల ప్రభావం కూడా అధికంగా కనపడింది.
* తెలంగాణలో రైతుబంధు పథకానికి ఎంతటి ప్రచారం లభించిందో ఆంధ్రప్రదేశ్‌లో పసుపు–కుంకుమ పథకానికి కూడా అంతటి ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులతోపాటు, రాష్ట్రానికి ఏదో కీడు జరగబోతోందని భావించిన వర్గాలన్నీ చంద్రబాబువైపు చేరినట్టుగా ఓటింగ్‌ సరళిని బట్టి స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ అండ్‌ కో ప్రచారం చేసినట్లుగా వ్యతిరేకత లేకపోవడంతో ఈ పర్యాయం కూడా జగన్మోహన్‌ రెడ్డికి నిరాశ తప్పదన్న అభిప్రాయం ఉంది.