బాబు నాన్ స్టాప్ టూర్లు - నేడు...??

September 17, 2019

కౌంటింగ్ సమయం దగ్గరపడుతున్న పట్టువీడకుండా ఈవీఎంల విషయంలో చంద్రబాబు పోరాడుతున్నారు. దీనిని ఓటమి భయం అని కొందరు కామెంట్ చేస్తున్నారు. బాబు గురించి తెలిసిన కొందరు ఇదొక వ్యూహాత్మక చర్య... మే 23న అదేంటనేది బయటకు వస్తుందని అంటున్నారు. సీఎంగా ఉన్నంత కాలం తీరిక లేకుండా కార్యక్రమాలు పెట్టుకున్న చంద్రబాబు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్న సమయంలోనూ విశ్రాంతి తీసుకోవడం లేదు.
ఈరోజు మధ్యాహ్నం ఈసీని 21 పార్టీలతో పాటు బాబు కలిశారు. అంతకుముందు ఆ తర్వాత రెండు మీటింగులు జరిగాయి. వాటిని ముగించిన చంద్రబాబు సాయంత్రానికి బెంగుళూరు చేరుకున్నారు. అక్కడ కుమారస్వామి, దేవెగౌడతో సమావేశమయ్యారు. ఫలితాల అనంతర వ్యూహాలు, జాతీయ రాజకీయాలు వంటి అంశాలపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
​రాత్రికి బెంగుళూరులోనే చంద్రబాబు బస చేయనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు బెంగళూరు నుంచి కుప్పం​​కు​ వెళ్తారు. అక్కడ గంగమ్మ జాతరలో పాల్గొంటారు.​ భార్య భువనేశ్వరి ఇప్పటికే కుప్పంలో ఉన్నారు.​ చంద్రబాబు దంపతులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించు​కుంటారు. మళ్లీ మధాహ్నం అనంతరం, చంద్రబాబు విజయవాడ​కు బయలుదేరుతారు. కౌంటింగ్ రోజున అమరావతి నివాసం, లేదా పార్టీ ఆఫీసులో ఉంటారు.