చంద్రబాబు రామోజీ ఆకస్మిక సమావేశం

May 24, 2020

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మీడియా దిగ్గజం రామోజీరావు ఈరోజు అధికారికంగా బేటీ అయ్యారు. చంద్రబాబు హెలికాప్టర్లో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావును కలిశారు. ఈ మీటింగ్ ఏకాంతంగా జరిగినట్టు తెలుస్తోంది. ప్రైవేటు కార్యక్రమం అని బయటకు చెబుతున్నా... అజెండా మాత్రం రాజకీయమే అని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా చర్చల సారాంశం ఏంటనేది ఇప్పటికయితే ఇంకా వెల్లడికాలేదు.
అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు హాట్ గా ఉన్న నేపథ్యంలో వీరి కలయికకు ప్రాధాన్యం ఏర్పడింది. రామోజీరావు బీజేపీ మద్దతు దారుడు. కానీ ప్రాంతీయ స్థాయిలో అతను చంద్రబాబుకు అనుకూలంగా లేకున్నా వ్యతిరేకంగా అయితే పనిచేయరు. ఈ నేపథ్యంలో మరి ఇద్దరి మధ్య ప్రధాన అజెండా ఏంటి అన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చ. రెండున్నరకల్లా వీరి మీటింగ్ ముగుస్తుంది. చంద్రబాబు అమరావతి బయలుదేరుతారు. మరోవైపు ఇక నేనే సీఎం అని పార్టీ ఆఫీసును జగన్ అమరావతికి షిఫ్ట్ అయ్యారు. జగన్ అటు వెళ్లడం, చంద్రబాబు ఇటు రావడం అంటూ కొందరు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.