మహేష్ బాబుతో కలిసి చంద్రబాబు...

May 30, 2020

ప్రముఖ దర్శకురాలు, సతీమణి విజయనిర్మలను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న అలనాటి సూపర్ స్టార్ కృష్ణను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నాయుడు కలిసి పరామర్శించారు. ఆ సమయంలో మహేష్ బాబు కూడా అక్కడే ఉన్నారు. వియ్యంకుడు, బావమరిది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి చంద్రబాబునాయుడు శోకంలో ఉన్న నటుడు కృష్ణను పరామర్శించారు. 

వారిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు ట్విట్టరులో ఒక సందేశం పెట్టారు. ’’ఇటీవల స్వర్గస్థులైన విజయనిర్మలగారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. తీవ్ర శోకంలో ఉన్న వారిని చూసి చాలా బాధ కలిగింది. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో భగవంతుడే వారికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలి’’ అని వ్యాఖ్యానించారు.