చంద్రన్న ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్

May 25, 2020

రాహుల్ గాంధీ కంటే చంద్రబాబు ప్రధాని పదవికి ఎక్కువ అర్హుడు అని సీనియర్ జాతీయ నాయకుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో రెండే రెండు కూటములు ఉన్నాయి. ఒకటి బీజేపీ కూటమి, ఇంకోటి రీజనల్ పార్టీలతో కూడిన కాంగ్రెస్ కూటమి. కాంగ్రెస్ ఉన్న కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై రాహుల్ అని కాంగ్రెస్ భావిస్తోంది కానీ మమత, మాయావతి, శరద్ పవార్ తదితరులు రేసులో ఉన్నారు. అయితే, తాజాగా నేనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ వ్యాప్తంగా ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. ప్రధాని పదవికి కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీ కంటే టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సరైన వ్యక్తి అని పవార్ అన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శరద్ పవార్ మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు. వాస్తవానికి ఈ కామెంట్లు చేసినపుడు అక్కడ చంద్రబాబు కూడా లేరు. అయినా కూడా చంద్రబాబు బెస్ట్ ఆప్షన్గా చెప్పడంతో తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మా బాబుది ప్రధాని రేంజ్ అంటున్నారు. 

ఆయన ఇంకా ఏమన్నారంటే... విపక్షాల కూటమిలో ప్రధాని అభ్యర్థిని ఎంచుకోవాల్సి వస్తే చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం మాయావతి రాహుల్ కంటే ముందువరుసలో ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇది ఇవన్నీ ఇపుడు ముఖ్యం కాదు...  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తాము ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తాం అని శరద్ పవార్ స్పష్టం చేశారు. 

వాస్తవానికి కొన్ని నెలల క్రితం దేశంలో ప్రధాని రేసులో ఉన్న ఐదుగురు అంటూ ఒక రాజస్తాన్ టాప్ న్యూస్ పేపర్ చంద్రబాబుతో సహా రాహుల్, మాయావతి, మమత, రాహుల్ గాంధీలను ప్రచురించింది. అందులో శరద్ పవార్ కూడా ఉన్నారు. ఈ శరద్ పవారే చంద్రబాబును బెస్ట్ ఆప్షన్ అనడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అయితే, ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ప్రాంతీయ పార్టీల్లో సీట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి అన్నదాని కంటే ఎవరు ఎక్కువ సీట్లను కూటమిలోకి తేగలరు అన్నదాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. అలాంటపుడు కచ్చితంగా చంద్రబాబు అనే చెబుతారు ఎవరైనా. కాబట్టి మే చివరి వారంలో ఈ దేశపు ప్రధాని  ఎవరో ప్రపంచానికి తెలుస్తోంది.