గతానికి భిన్నంగా... జ్జాపకాల్లోకి వెళ్లిన బాబు

August 07, 2020

చంద్రబాబు నిరంత శ్రామికుడు. నిరంతర విద్యార్థి. రిలాక్స్ అవడం ఎలా అన్నది చంద్రబాబుకు తెలియనిది. ఆయన దృష్టి ఎపుడూ ఎకానమీ, అడ్మినిస్ట్రేషను, టెక్నాలజీ తప్ప... ఎమోషన్స్ పైన తక్కువ. అయితే... 60లు దాటాక ఎలాంటి వారికి అయినా జ్జాపకాలు మజాను ఇస్తాయి. బాల్యం నుంచి  యూనివర్సిటీ వరకు ... బాబుకు కూడా ఎన్నో జ్జాపకాలున్నాయి. 

తాజాగా కుప్పం ప్రజా చైతన్య యాత్రలో ఉన్న చంద్రబాబు నోస్టాల్జియాలోకి వెళ్లారు. ఈరోజు కంగుంది గ్రామానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ తన మిత్రుడు రత్నం ఇంటికి వెళ్లారు. అయితే, ఆయన సహాధ్యాయి రత్నం లేరు. ఆయన తండ్రిని కలిసిన బాబు వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కాలేజీ రోజుల్లో చంద్రబాబు తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటోలను రత్నం ఇంట్లో దాచారు. వాటిని రత్నం తండ్రి బాబుకు చూపించార. వాటిని చూసిన చంద్రబాబు పాత జ్జాపకాల్లోకి వెళ్లిపోయారు. ఆ ఫొటోలను ఫొటో తీసుకుని తన ట్విట్టరులో పెట్టుకున్న చంద్రబాబు మురిసిపోయారు.

వాటిని ట్విట్టరులో షేర్ చేస్తూ ’’నా స్నేహితుడి తండ్రిగారు, 98 ఏళ్ళ పి.ఆర్. శ్యామ్ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నాను. రత్నం తన దగ్గర ఉన్న యూనివర్సిటీలో మా బ్యాచ్ ఫోటోలను చూపించారు. ఒక్కసారిగా నా కాలేజీ రోజులు, ఆనాటి స్నేహాలు అన్నీ గుర్తొచ్చాయి. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చింది’’ అంటూ సంతోషం వ్యక్తంచేశారు.