బడ్జెట్ పై బాబు రెస్పాన్స్  మాటేంటి?

July 04, 2020

జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టని ఏపీ బడ్జెట్పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అసలే లెక్కల మాస్టారు, ఆర్థిక నిపుణుడు అయిన చంద్రబాబు ఇలాంటి విషయాలను అంత సలువుగా వదిలిపెట్టరు. తాజాగా ఈరోజు పెట్టిన బడ్జెట్ పై స్పందించిన జగన్... కొన్ని గంటల ముందు జగన్ మమ్మల్ని వేలెత్తి చూపిన విషయంలోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యారని వ్యాఖ్యానించారు. వ్యవసాయం గురించి ప్రత్యేక శ్రద్ధ అని చెబుతూ వ్యవసాయానికి ఆయువు పట్టు అయిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వం చేసిన కేటాయింపుల కంటే 22 శాతం తక్కువ కేటాయింపులు చేశారంటే... ఈ ప్రభుత్వం అసమర్థత ఏంటో అర్థమైపోతుందన్నారు. చంద్రబాబు లేవనెత్తిన కొన్ని పాయింట్లు ఇక్కడ సంక్షిప్తంగా...
* ఏపీలో అప్పు గురించే మాట్లాడుతున్నారు. కానీ ఏపీ తలసరి ఆదాయం భారీగా పెరిగిన విషయం మాత్రం చెప్పరు.
* 2014లో ఏపీ ప్రజల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రూ.6 వేలే ఎక్కువ. ఇప్పుడు దేశపు తలసరి ఆదాయం కంటే రూ.38 వేలు ఎక్కువ. ఇది తెలుగుదేశం ప్రభుత్వం పనితనం కాదా?
* వైసీపీ నేతలు చెప్పే మాటలు చేయదు. బడ్జెట్ కేటాయింపులే దానికి నిదర్శనం. శ్వేతపత్రంలో టీడీపీని ఏమని తప్పు పట్టారో అంతకంటే ఘోరమైన కేటాయింపులు చేశారు. సున్నా వడ్డీ రుణాలకు రూ.4000 కోట్లు అవసరం అని పర్భుత్వమే చెప్పి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడం ఏంటి? 
* సొంత రాష్ట్రం ప్రజల ప్రయోజనాలను ముందు నెరవేర్చండి. మిమ్మల్ని గెలిపించింది ఇక్కడ ప్రజలు. మీరు ఆలోచించాల్సింది వీరి గురించే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
* పొరుగురాష్ట్రంలో నీళ్లు పారించేందుకే అంత ఉత్సాహం ఎందుకు? ఇది ముందు చూపులేని బడ్జెట్.
* ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో 49 వేల ఉద్యోగాలు వచ్చాయని మీ లెక్కలే చెప్పాయి. దానికేమంటారు?  

కొసమెరుపు - మనకి విభజన పరంగా ఆర్ధిక నష్టం చాలా జరిగింది. ఫిస్కల్ డెఫిసిట్ విభజన తర్వాత 6 శాతానికి కి చేరింది. దానిని 3.67 శాతానికి తగ్గించారు చంద్రబాబు. అదే సమయంలో 1.8 శాతం  ఫిస్కల్ డెఫిషిట్ (చాలా తక్కువ) తో మొదలైన తెలంగాణ 2016-17 లో  5.5 శాతానికి వెళ్ళింది.