సంక్షోభ చంద్రుడు !

July 13, 2020

ఏ ఇబ్బంది లేకపోతే చంద్రబాబుకు ఇబ్బందే. అతడికి క్లిష్ట పరిస్థితులు లేకపోతే చాలా నష్టపోతాడు. శత్రువు ఎంత గట్టిగా ఎదరిస్తే ఈ నాయుడు అంత బలవంతుడు అవుతూ ఉంటాడు. చంద్రబాబు గెలవాలంటే... అతనికి కష్టం రావాలి. చంద్రబాబు ఎదిరి నిలవాలంటే... అతనికి ఇబ్బంది రావాలి. అంతా సాఫీగా ఉందనుకుని చంద్రబాబు అనుకున్నపుడు ఎపుడూ గెలవలేదు. కానీ బాబు పని అయిపోయిందనుకున్నపుడల్లా గెలిచాడు. ఎందుకంటే ఓటమిని ఎదురించలేకపోతే నాయకుడు ఎట్లా అవుతాను అనేది చంద్రబాబు ఫీలింగ్. అందుకే 2004లో గెలుస్తాడు అనుకున్నారు. కానీ ఓడిపోయాడు. 2009లో ఇంకేం మహాకూటమి వచ్చేసింది గెలుస్తాడు అని టాక్ వచ్చింది... ఓడిపోయాడు.. 2014లో చంద్రబాబు ఓడిపోతాడు అని టాక్ వచ్చింది అపుడు గెలిచాడు. అదీ బాబు... అతనిలో గెలుస్తామనే కాన్ఫిడెంట్ ఉండకూడదు. కాన్ఫిడెంట్ ఉంటే బాబు రిలాక్స్ అవుతాడు. రిలాక్స్ అయితే శత్రువులను తక్కువ అంచనా వేస్తాడు. శత్రువును తక్కువ అంచనా వేసినపుడు కచ్చితంగా పరాజయం పాలవుతాడు. బాబుకు ఎపుడూ ఓడిపోతామనే ఫీడ్ బ్యాకే ఉండాలి.
వాస్తవానికి చంద్రబాబుకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది కూడా రాజకీయ సంక్షోభాలే. టీడీపీ వ్యవస్థాపక సమయంలో దూరంగానే ఉండిపోయారు. ఎన్టీయార్ ను గవర్నర్ రామ్ లాల్ గద్దె దించిన సంక్షోభంలో ఎన్టీఆర్ కు రాజకీయ వ్యూహాలను రచించింది చంద్రబాబే. వ్యూహ రచనలో జాతీయంగా చక్రం తిప్పడంలో సారథిగా వ్యవహరించారు. అందుకే ఎన్టీయార్ కు బాబు అంతగా నచ్చారు.
అప్పట్లో అతని వ్యూహాల వల్లే పార్టీలో గుర్తింపు వచ్చింది. పార్టీలో పట్టు సాధించగలిగారు. 1996లో జాతీయ పార్టీలకు దేనికీ స్పష్టమైన మెజార్టీ లేని స్థితిలో కేంద్రంలో అనిశ్చితి ఏర్పడితే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు జాతీయ సంక్షోభాల్లో తనదైన పాత్ర పోషించి కీలకంగా మారారు.
ఇలా రాజకీయ సంక్షోభాలే కాదు... స్వయంగా ఆర్థిక నిపుడు అయిన బాబు ఆర్థిక క్లిష్ట పరిస్థితులను కూడా గట్టెక్కించాడు. విభజనతో 2014లో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఒడిదుడుకుల్లో పడింది. తొలి ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీని నిలబెట్టారు. దేనికీ లోటు రాకుండా సంపద సృష్టించారు. సమస్యలను పరిష్కరించడంలో దిట్ట కాబట్టే... అతనికి వాగ్దాటి లేకపోయినప్పటికీ అతని మేథస్సును జనం నమ్మి నాయకుడిగా ఎంచుకుంటున్నారు. వారి నమ్మకాన్ని చంద్రబాబు కూడా నిలబెడుతూ వచ్చాడు.