ఆధారాలతో వైసీపీ గాలి తీసేసిన చంద్రబాబు

August 07, 2020

చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలి... అనేక ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వైసీపీ దూకుడును ఎదుర్కోవడానికి టీడీపీ ఎప్పటికపుడు కౌంటర్లు వేస్తూనే ఉంది. జగన్ ప్రభుత్వం బాబు నిర్ణయాలన్నీ తప్పు అని నిరూపించడానికి తీవ్రంగా ప్రతయ్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే... ప్రతి దాంట్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. 

తాజాగా ప్రకాశం బ్యారేజీలో కెపాసిటీకి మించి నీటిని నిల్వ చేసి 50 వేల ఎకరాల పంట మునిగిపోవడానికి ప్రభుత్వం ఏ విధంగా కారణం అయ్యిందో చంద్రబాబు వీడియో ప్రజెంటేషన్ తో మీడియాకు వివరించారు. ఇది ముమ్మాటికీ ప్రకృతి విపత్తు కాదని అని చెప్పిన చంద్రబాబు...  రాజధానిని ముంచాలనే ఆలోచన తప్ప ప్రభుత్వానికి మరో ఆలోచన లేదని ఆరోపించారు. రాజధాని తరలించడానికి సృష్టించిన విపత్తు అని వ్యాఖ్యానించారు. ఇంత జరిగితే వరదలపై సీఎం జగన్ ఒక్క సమీక్ష కూడా చేయకపోవడం దారుణమైన విషయం అని చంద్రబాబు తప్పుపట్టారు.