జగన్ ఆ మాట ఎందుకు తప్పారు? నిలదీసిన బాబు

May 26, 2020

జగన్ తాను అడుగడుగునా మాట తప్పుతూ మాట తప్పిన కులం అంటున్నారు. వాస్తవానికి జగన్ తప్పినన్ని మాటలు ఎవరూ తప్పలేదు. పెద్ద ఉదాహరణలో దానికి చాలా ఉన్నాయి. వాటిలో రెండు చూద్దాం. ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తా అని ఉద్యోగులకు హామీ ఇచ్చాడు. ఇప్పటికీ వీడియో సాక్ష్యాలున్నాయి. కానీ చేయలేదు మాట తప్పాడు. అలాగే 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తాను అన్నారు. అదీ మాట తప్పారు. ప్రత్యేక హోదా ఊసే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే... జగన్ మాట తప్పిన విషయాలు ఒక వంద పేజీలు అవుతాయి. తాజాగా జగన్ తప్పుడు హామీలపై చంద్రబాబు నిలదీశారు.

ఏపీలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. వైసీపీ సర్కారు ధరల నియంత్రణలో విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసరాల ధరలు మండిపోతుంటే.. జగన్ చేతకాని వాడిలా ఉండిపోయాడు అని టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ను విమర్శించారు. ఉల్లి ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే.. వాటిని తగ్గించే ప్రయత్నం చేయకపోగా, దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు. రైతుల రాజ్యం ఆరు నెలల్లోనే దళారుల రాజ్యం అయ్యిందన్నారు. జగన్ నిర్లక్ష్యం పుణ్యమా అని మంచి పంటలు పండే ఏపీలో ఉల్లి కొరత తీవ్రంగా ఉండటం ఏంటన్నారు?

ఉల్లి కోస్తే కన్నీళ్లొచ్చేవి. జగనొచ్చాక ఉల్లి కొనాలంటనే కన్నీళ్లు వస్తున్నాయి. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటుతున్నాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదు. ఇతర చర్యలు లేవు. దళారులు ఉల్లికొరతను సృష్టిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. మీ సంగతి ప్రజలకు అర్థమైంది. స్థానిక ఎన్నికల్లో మీకు భవిష్యత్తు అర్థమవుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.