చంద్రబాబును ఇలా ఎపుడూ చూసి ఉండరు

June 05, 2020

తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబునాయుడు క్షణం ఖాళీగా ఉండలేరు. ఏదో ఒక పనిలో నిమగ్నం అవడం ఆయనకు అలవాటు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నిరంతరం పనిచేస్తుంటారు. తాజాగా కరోనా నేపథ్యంలో దేశమంతటా లాక్ డౌన్ నడుస్తోంది. ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా... టీడీపీఎల్పీ సభ్యుల ఒక నెల వేతనాన్ని ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. వ్యక్తిగత స్థాయిలో కూడా నారా కుటుంబం నుంచి సీఎం ఫండ్ కు 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాలను ట్విట్టరులో వెల్లడించిన లోకేష్ ఒక అరుదైన ఫొటోను షేర్ చేశారు. ఒక పెద్ద హాల్లో చంద్రబాబు మినహా ఎవరూ లేని ఫొటో అది. సాధారణంగా ఒక గల్లీలీడరే ఎవరో ఒకర్ని వెంటేసుకుని తిరుగుతారు. అలాంటిది ఇంత పెద్ద లీడరు ఏకాంతంగా ఒక గదిలో ఉన్న ఫొటో ఇదే మొదటిది. అది కూడా కాన్ఫరెన్స్ రూంలో. కరోనా ఇలాంటి ఎన్నో చిత్రాలను మనకు పరిచయం చేసింది.