జగన్‌తో కలిసేందుకు సిద్ధమైన చంద్రబాబు

May 25, 2020

మీరు చదివింది నిజమే.. ఈ మాటలు చంద్రబాబే స్వయంగా అన్నారు. జగన్‌ తమతో కలిసొస్తే కచ్చితంగా స్వాగతిస్తామని ఏపీ సీఎం చెప్పారు. అయితే ఈ మాటలు అన్నారా లేదా అని మాత్రం అయోమయానికి గురికాకండి.. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల సాధన కోసం ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడిని జాతీయ మీడియా రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మాటా చెప్పారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలుపుకుని వెళుతున్న మీరు జగన్‌ పార్టీని స్వాగతిస్తారా అని అడిగారు. దాని సమాధానంగా జాతీయ ప్రయోజనాల కోసం జగన్‌ వస్తానంటే కచ్చితంగా స్వాగతం చెబుతామని బాబు స్పష్టం చేశారు.

దాంతో షాక్‌కు గురైన మీడియా ప్రతినిధి ప్రశ్న మళ్లీ అడుగుతున్నాను మరోసారి చెప్పండి అని అడిగారు. ఎన్నికలు అయిన తరువాత మీ కూటమిలోకి జగన్‌ రావాలనుకుంటే స్వాగతిస్తారా అని మళ్లీ అడిగారు. అయితే ఈ సారి వైఎస్‌ఆర్‌సీపీకి కౌంటర్‌ ఇస్తూ చిరునవ్వుతో చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఒకటి రెండు సీట్లు వచ్చే ఆ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం వస్తానంటే ఎందుకు స్వాగతం పలమని చురక వేస్తూ మాట్లాడారు.. ఆ వీడియో నమస్తే ఆంధ్రా పాఠకులకోసం… కింద లింక్‌ క్లిక్‌ చేసి చూడండి…