హైదరాబాద్‌కు వ‌చ్చేసిన చంద్ర‌బాబు

July 03, 2020

టీడీపీ అధినేత చంద్ర‌బాబు యూరప్ టూర్ ముగిసింది. హైద‌రాబాద్ లోని ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో విదేశీ ప‌ర్య‌ట‌న‌లు వెళ్లిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి మాదిరి ప‌రిస్థితి గ‌తంలో బాబుకు ఎదురై ఉండ‌దు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఈ నెల 19న యూర‌ప్ టూర్ వెళ్లిన బాబు ఆరు రోజుల అనంత‌రం హైద‌రాబాద్ కు వ‌చ్చారు.
ఈ మ‌ధ్య కాలంలోనే పార్టీకి సంబంధించి ప‌లు ప‌రిణామాలుచోటు చేసుకోవ‌టం తెలిసిందే. పార్టీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు వెళ్లిపోవ‌టం.. మ‌రికొంద‌రు పార్టీ నేత‌లు బీజేపీలోకి వెళ్లేందుకు రెఢీ కావ‌టం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా క‌లెక్ట‌ర్ల స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌.. బాబు స‌ర్కారు నిర్మించిన ప్ర‌జావేదిక‌ను కూల్చివేస్తామ‌ని చెప్ప‌టంతో పాటు.. అందుకు ముహుర్తం బుధ‌వారంగా డిసైడ్ చేయ‌టం తెలిసిందే. తాజాగా పార్టీలో నుంచి జంపింగ్స్.. ప్ర‌జావేదిక నిర్మాణం కూల్చివేత విష‌యంలో బాబు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
ఇదే ప్ర‌జావేదిక‌ను త‌మ‌కు కేటాయించాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు లేఖ రాయ‌టం.. అనంత‌రం అది అక్ర‌మ క‌ట్ట‌టండా పేర్కొంటూ.. దాన్ని కూల్చివేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఈ రోజు ఎట్టి ప‌రిస్థితుల్లో బాబు ప్రెస్ మీట్ ఉంటుంద‌ని చెబుతున్నారు.