ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పేసిన ఏపీ సీఎం

May 28, 2020

ఈరోజు కేబినెట్ సమావేశం ఏపీలో హాట్ టాపిక్. మొత్తానికి బాబు అందరినీ పరీక్షిస్తున్నాడని వారికి అర్థం కావడంతో ఈసీ కూడా ఎందుకు గొడవలు అన్నట్టు అనుమతి ఇచ్చిందని తెలుగుదేశం వారు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే... ఈరోజు ఇంతకంటే ఆసక్తికరమైన విషయం చెప్పారు చంద్రబాబు. మే 19న రాబోయే ఏపీ ఎగ్జిట్ పోల్స్ గురించి చంద్రబాబు చెప్పేశారు.

మే 23న ఫలితాలు వస్తాయి. మే 19న ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంటారు. వాళ్లు 19న చెప్పబోయేది అదే. కానీ వాస్తవానికి అధికారంలోకి రాబోయేది మాత్రం తెలుగుదేశం పార్టీయే. మీరు ఎగ్జిట్ పోల్స్ చూసి అనవసరంగా ఆందోళన చెందకండి అని చంద్రబాబు కొందరు పార్టీ ముఖ్యనేతలకు చెప్పారట. ఇది అమరావతిలో జరిగిన సీన్. 

సరిగ్గా కేబినెట్ సమావేశానికి వెళ్లే ముందు అక్కడున్న కొందరు నేతలతో చంద్రబాబు ఫలితాలపై ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే... ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ వైపు మొగ్గు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. మరి లగడపాటి పోల్స్ పరిస్థితి ఏంటి? ఎగ్జిట్ పోల్స్ లో కూడా తెలియని విషయం చంద్రబాబు కు ఎలా తెలిసింది. అబ్బా ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్లా ఉంది. 

దేవుడా వచ్చే ఎన్నికలు అయినా పోలింగ్ కి రిజల్టుకి ఈ గ్యాప్ లేకుండా చేసి మా ఏపీ ప్రజలను టెన్షన్ నుంచి తప్పించాలని మనవి.