సీఎం ఫ్రైడే అటెండెన్స్ పై చంద్రబాబు సెటైర్లు

June 04, 2020

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అవినీతి సామ్రాజ్యానికి అధ్యక్షుడైన జగన్....శుద్దపూసలా నీతులు చెబుతున్నారంటూ మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో ప్రతి శుక్రవారం జైలుకు వెళ్లే జగన్ కూడా నీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అన్ని వేల కోట్లు దోచేసిన జగన్ పోటీ చేయడానికి అర్హుడా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఎవిరి ఫ్రైడే కోర్టుకు వెళ్లే మనిషి...ఎంత సత్యమైన మనిషో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ఇటువంటి జగన్ అవినీతి చేసిన వాళ్ళని పనిష్ చేస్తానని అనడం...జైలుకు పంపుతానని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే వారు పాలించడం వల్లే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మండిపడ్డారు.

అన్ని అనుమతులు ఉన్నా కూడా తనపై 151 crpc కింద కేసులు పెట్టారని, ఏదో సెక్షన్ పేరుతో తనను ప్రశ్నించేవారిపై జగన్ కేసులు పెడుతారని చంద్రబాబు మండిపడ్డారు. ఇకపై జగన్ ఆటలు సాగనివ్వబోమని, పోరాడుతామని, అందుకు ప్రజల సహకారం కావాలని చంద్రబాబు అన్నారు. ఏపీలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, వైసీపీ నేతలు లిక్కర్ డాన్ లుగా మారారని చంద్రబాబు విమర్శించారు. ఏపీకి ఎప్పుడూ విననటువంటి ప్రాబ్లం వచ్చిందని, ఏపీలో ఎన్నడూ లేని నకిలీ బ్రాండ్లు వచ్చాయని అన్నారు. మన ఆరోగ్యంతో కూడా జగన్ చెలగాటం ఆడుతున్నారని, తనకైతే అర్థం కావట్లేదని, జగన్ పాలనలో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడ్డామని చంద్రబాబు మండిపడ్డారు.