జగన్ నోట మాట రాకుండా చంద్రబాబు సవాల్

May 30, 2020

ఆరు రోజుల పాటు యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌ ముగించుకుని వచ్చిన చంద్రబాబు హైదరాబాదు రాగానే జగన్ కు దిమ్మతిరిగే సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజావేదిక కూల్చాలని చేసిన ఆలోచన సబబు కాదన్నారు. గతంలో పెట్టిన వైఎస్ విగ్రహాలు అన్నీ అనుమతులు లేకుండా ఏర్పాటుచేసినవే. అందులో జగన్ స్వయంగా ఆవిష్కరించనవి చాలా ఉన్నాయి. వాటిని మేము కూల్చేవేశామా? అని జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రశ్నించారు చంద్రబాబు. మరి అక్రమ కట్టడాలు అన్నీ కూల్చేస్తే రోడ్లు, జంక్షన్లు ఆక్రమించి ట్రాఫిక్ ను ఇబ్బంది పెట్టే అన్ని వైఎస్ విగ్రహాలను కూడా కూల్చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
చంద్రబాబు వేసిన ప్రశ్న ఇంతవరకు ఏ టీడీపీ నేతకు తట్టలేదు. అనుభవమా ? మజాకా ? అన్నట్లు నేతల్లో భరోసా నింపేలా చంద్రబాబు స్పందించారని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈరోజు ఇన్ని కబుర్లు చెబుతున్న జగన్ ఆరోజు స్వయంగా అక్రమంగా అనుమతుల్లేకుండా విగ్రహాలు ఎలా ఏర్పాటుచేరో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని జగన్ ను వారు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో పరిణామాలపై చంద్రబాబు స్పందిస్తూ టీడీపీ శ్రేణుల మీద దాడులను తప్పుపట్టారు. ప్ర‌జావేదిక‌ను కూల్చివేత ప్రధాన చర్చ అయ్యింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్రజావేదిక కూల్చివేతను తప్పు పడుతూ పాత విష‌యాల్ని ప్రస్తావించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాల్ని ప్ర‌తి ఊర్లో ఏర్పాటు చేశార‌ని.. వీటి ఏర్పాటు కోసం అనుమ‌తి తీసుకోలేద‌ని గుర్తు చేశారు. వైఎస్ విగ్ర‌హాల్ని ఏర్పాటు చేసిన ప్ర‌దేశాల్లో 95 శాతానికి పైగా అనుమతులు లేకుండా ఏర్పాటుచేశారని చంద్రబాబు ప్రస్తావించారు. మరి వాటిని కూడా కూల్చివేయాలి కదా అని అన్నారు. మరి చంద్రబాబు ఇచ్చి తాజా పంచ్ కు జగన్ ఎలా రియాక్టవుతారో చూడాలి.