బాబు సెటైర్ ఓ రేంజ్ లో పేలింది - భ్రమరావతిని అలంకరించిన జగన్

May 25, 2020

సాధారణంగా చంద్రబాబులో హాస్యరసం కొంచెం తక్కువే. ఆమాటకు వస్తే జగన్ కూ అది తక్కువే. వైఎస్ లో ఇది కాస్త ఎక్కువగా ఉండేది. అయితే... మూసగా ఉండే చంద్రబాబు మాటల్లో ఇటీవల చురుకుదనం పెరిగింది. ముఖ్యంగా అమరావతిని భ్రమరావతిగా చిత్రీకరించిన జగన్ పై చంద్రబాబు వేసిన సెటైర్ ఈరోజు ట్విట్టరులో మహా బాగా పేలింది. నిజంగానే దేవుడి స్క్రిప్ట్ బాగుందంటూ.. అమరావతిపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశాడు. అమరావతి అనేది గ్రాఫిక్స్ అని జగన్ పదే పదే అన్నాడు. కానీ అదే భ్రమరావతి ఆయన బాగా అలంకరించాడే అంటూ చంద్రబాబు వ్యంగాస్త్రం వేశారు. 

బాబు ట్వీట్ -

దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు.