రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు

August 09, 2020

ఏపీలో అంతా అయోమయం. జగన్ రావాలి అని కోరిన వారికి, జగన్ వద్దనుకున్న వారికి ఇబ్బందులు సమానంగా ఉన్నాయి. ప్రతి వర్గాన్ని జగన్ తన నిర్ణయాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది చిరుద్యోగులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు లేటు. ఆశా వర్కర్లు ధర్నాలుచేస్తున్నారు. రైతులు రోడ్డున పడ్డారు. ఇలా ఒకటీ రెండు కాదు. అన్ని వర్గాలు జగన్ నిర్ణయాలతో సతమతం అవుతున్నాయి. చివరకు అమరావతి విషయంలో జగన్ ఆలోచనా విధానం ప్రమాదకరంగా ఉంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా రెండు పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు.
అమరావతి కోసం పోరాటం
అమరావతిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడానికి, రాజధాని మార్పును అడ్డుకోవడానికి చంద్రబాబు పోరాటం మొదలుపెడుతున్నారు. ఈరోజు రైతులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి కోసం పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మార్చడానికి ఒప్పుకోం అని, రాజధాని తరలించే కుట్రలు అడ్డుకుంటామని చంద్రబాబు ఘంటాపథంగా చెప్పారు. ప్రభుత్వం అనాలోచిత వ్యాఖ్యలతో రైతులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు విమర్శించారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తోంది. ఇతర పార్టీలను కలుపుకుని పోవడానికి కూడా నిర్ణయించాం. దీనికోసం సీనియర్ నేతలతో ఒక కమిటీ వేస్తాం.. అని చంద్రబాబు వెల్లడించారు. రాజధాని ముంపు ప్రాంతం కాదని, దానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం అని చంద్రబాబు చెప్పారు. అవినీతి రహితంగా స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల సహకారంతో ప్రపంచ స్థాయి రాజధానికి రూపకల్పన చేశామని చంద్రబాబు అన్నారు.

ప్రజల్లోకి చంద్రబాబు
చంద్రబాబు మరో తాజా సంచలన నిర్ణయం... ప్రజాయాత్ర. తీవ్ర అసంతృప్తితో, అయోమయ పాలనతో విసిగిపోయిన ప్రజానీకం బాధలు విని వారికి అండగా ఉండటానికి చంద్రబాబు ప్రజాయాత్రను ప్రారంభించనున్నారు. దశల వారీగా చేసే ఈ యాత్ర అన్ని జిల్లాల్లో ఉంటుంది. చంద్రబాబు స్వయంగా ప్రజలను కలుస్తారు. త్వరలోనే పర్యటన ఖరారు అవుతుందని పార్టీలు వర్గాలు తెలిపాయి. ఏపీవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబును నేతలు కోరగా... వారి కోరిక మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ అరాచకపాలనపై ’’వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పాలన‘‘ పై పుస్తకాన్ని విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు చంద్రబాబు.