జగన్ కి వరంలా మారిన చంద్రబాబు విజన్

June 06, 2020

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఐటీ రంగానికి ఉన్న ప్రాధాన్యతను అందరికన్నా గుర్తించిన చంద్రబాబు....హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటు చేశారు. ఐటీ సేవలందించే ప్రధాన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ లక్షలాదిమందికి ఉపాధి కల్పించిందంటే అదంతా చంద్రబాబు ముందుచూపు చలవే. ఈ రోజు విదేశాల్లో లక్షలాది మంది తెలుగు వారు ఐటీ రంగంలో సేవలందిస్తున్నారంటూ దానికి కారణం చంద్రబాబే. ఇక, తన ముందు చూపుతో చంద్రబాబు ఏపీలోనూ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. పాలనలో డిజిటల్ సేవలను ఉపయోగించడం మొదలు బయోమెట్రిక్ విధానం వరకు చంద్రబాబు టెక్నాలజీని వాడుకున్నంతగా మరే సీఎం వాడుకోలేదు. ఇక, వైద్యరంగంలోనూ చంద్రబాబు ముందు చూపుతో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 

ముందుచూపుతో చంద్రబాబు నెలకొల్పిన మెడికల్ హబ్....ఇపుడు దేశానికే తలమానికమైంది. కరోనా విపత్తు సమయంలో మాస్కులు, వెంటిలేటర్ల కొరతను ఏపీ అధిగమించడంతో పాటు మిగతా రాష్ట్రాలకూ సరఫరా చేసే దిశగా అడుగులు వేస్తోందంటే చంద్రబాబు ముందు చూపే కారణం. విశాఖలో చంద్రబాబు ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ లో నేడు లక్షలాది మాస్కులు, వెంటిలేటర్లు తయారు చేస్తున్న వైనంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మన దేశంలో వైద్య రంగ అనుబంధ ఉత్పత్తుల తయారీ సంస్థలు పెద్దగా లేవు. చిన్న సూది నుంచి సీటీ స్కాన్ యూనిట్ వరకు....ఏది కావాలన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే ఏకైక మార్గం. అలా దిగుమతి చేసుకున్న వస్తువుల ఖర్చు భారం ప్రజలపై పడుతోంది. 

ఇటువంటి నేపథ్యంలో నాటి సీఎం చంద్రబాబు చాలా గొప్పగా ఆలోచించారు. మన రాష్ట్రంలోనే వాటిని ఎందుకు తయారు చేయకూడదన్న ఆలోచన చంద్రబాబుకు వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా దానిని ఆచరణలో పెట్టేందుకు చంద్రబాబు పావులు కదిపారు. చంద్రబాబు ఆలోచనకు పలు కంపెనీలు తొడయ్యాయి. దీంతో, 2016 ఆగస్టులో విశాఖలో మెడ్ టెక్ జోన్ కు బాబు శంకు స్థాపన చేశారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ మెడికల్ టెక్నాలజీస్ జోన్ కు బాబు శ్రీకారం చుట్టారు. 270 ఎకరాల్లో ఏర్పాటైన మెడ్ టోక్ జోన్ ను 2018 డిసెంబర్ 12న ప్రారంభించారు. 10 వేల కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ఏర్పాటయ్యాయి. సూది నుంచి సీటీ స్కాన్ యంత్రం వరకు,  పలు పరిశోధనా శాలలు, టెస్టింగ్ సెంటర్లు, మార్కెటింగ్ ఆఫీసులు వంటివి చకచకా ఏర్పాటయ్యాయి.

ఆ తర్వాత ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా 10 నెలల పాలనలో జగన్...పలు వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. బాబు ఏర్పాటు చేసిన సంస్థలు, రూపొందించిన పథకాలను రూపుమాపడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్...మెడ్ టెక్ జోన్ ను కూడా నిర్వీర్యం చేశారు. అయితే, అనూహ్యంగా కరోనా నేపథ్యంలో ఏపీతో పాటు దేశవ్యాప్తంగా మాస్కులు, పీపీఈలు, వెంటిలేటర్లకు కొరత ఏర్పడింది. దీంతో, హఠాత్తుగా బాబుపై కక్షతో మూసేసిన మెడ్ టెక్ జోన్ జగన్ కు గుర్తుకు వచ్చింది. దానికి తోడు మాస్కులు, వెంటిలేటర్ల తయారీకి మెడ్ టెక్ జోన్ ను ఉపయోగించుకోమని...జగన్ కు బాబు లేఖ కూడా రాశారు. ఎటువంటి భేషజాలకు పోని బాబు...రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్ కు మంచి సలహాలు ఇచ్చారు. 

కరోనాపై పోరులో ప్రభుత్వానికి అండగా ఉంటామని పెద్దమనసు చాటుకున్నారు. చంద్రబాబు అనుభవాన్ని, సలహాను స్వీకరించిన జగన్... మాస్కులు, వెంటిలేటర్ లు తయారు చేయాలని మెడ్ టెక్ జోన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దేశవ్యాప్తంగా మాస్కులు, వెంటిలేటర్లకు తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో...మెడ్ టెక్ జోన్ ఏపీకి వరప్రదాయనిగా మారింది. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలూ మాస్కులు, వెంటిలేటర్లు ఎగుమతి చేయగలిగే స్థాయికి చేరుకుంది. చంద్రబాబు ముందుచూపుతో నాడు చేసిన పని...నేడు కరోనా విపత్తు సమయంలో కీలకమైంది. ముందుచూపుతో చంద్రబాబు చేపట్టిన అనేక సంస్కరణలు, పథకాలు, కార్యక్రమాలను జగన్ నిర్వీర్యం చేయకుండా ఉంటే...ఏపీ అభివృద్ధి బాటలో పయనిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Read Also

దేశంలో జీరోకి చేరిన వ్యభిచారం !
నైతిక బాధ్యతతో నీలం సహానీ రాజీనామా చేస్తారా?
Photos: సెలబ్రిటీలు వెలిగించిన దీపాలు