ఇంకా బాబు భ‌యంలోనే జ‌గ‌న్‌...ఇదే తార్కాణం

May 27, 2020

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు అంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఇంకా ఓ ర‌క‌మైన బెరుకు ఉందా? ఎన్నిక‌ల్లో ఓట్లు,సీట్లు సంపాదించిన‌ప్ప‌టికీ... చంద్ర‌బాబు ద‌క్కుతున్న ప్ర‌జాద‌ర‌ణ చూస్తే జ‌గ‌న్‌లో ఇంకా డౌటానుమానాలు ఉన్నాయా? అంటే అవున‌నే స‌మాధానం మెజార్టీ వ‌ర్గాల నుంచి వ‌స్తోంది. తాజాగా విశాఖ‌లో జ‌రిగిన ప‌రిణామాలు చూస్తుంటే పోలీసుల అండ‌తో జ‌గ‌న్  ప‌రోక్షంగా ఏ రేంజ్‌లో త‌న భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారో తెలిసిపోతోందని అంటున్నారు.
తాజా సంఘ‌ట‌న అంద‌రికీ తెలిసిందే.  ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖ వెళ్లిన చంద్రబాబును అధికార‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌ను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు.  తమ పార్టీ అధినేతను అడ్డుకున్నారన్న సమాచారంతో.. టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాదాపు 4 గంటలుగా ఎయిర్‌పోర్ట్‌ బయటే చంద్రబాబు నిలిచిపోయారు. అయితే, దీనిపై అనేక మంది భ‌గ్గుమంటుండ‌గా గ‌తంలో జ‌రిగిన అంశాన్ని వైసీపీ ప్ర‌స్తావిస్తోంది. 2017లో జనవరి 26న విశాఖలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహణలో భాగంగా విశాఖ చేరుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అడ్డుకున్నార‌ని అంటున్నారు. అయితే, అదే సమయంలో విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ జరుగుతుండడం.. ఆ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి కంపెనీల ప్రతినిధులు తరలిరావడంతో.. క్యాండిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వలేక‌పోయార‌ని గుర్తు చేస్తూ...దానికి ప్ర‌స్తుత ప‌రిస్థితి పొంతన‌ ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే కదా జగన్ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆ విషయం మరిచిపోతే ఎలా. బహిరంగసభలు, ధర్నాలు చేయడానికి జగన్ పెట్టుకున్ని ప్రతి వినతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దీంతోపాటుగా ఆయా సంఘ‌ట‌నల‌పై వ‌చ్చే సందేహాలు, కామెంట్లు వైసీపీ ప్ర‌భుత్వం భ‌యం, డొల్ల‌త‌నాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. అనుమతులు తీసుకుని ర్యాలీలు, నిరసనలు చేయడం రాజకీయ హక్కు అనేది రాజ‌కీయాల్లో లేని వారికి కూడా తెలిసిన అంశం. తాజాగా చంద్ర‌బాబు టూర్ విష‌యంలో...ఒక చేత్తో పోలీసు పర్మిషను ఇచ్చి మరో చేత్తో వైసీపీ వాళ్లు దాడి చేస్తారేమో అనే డౌటుతో చంద్ర‌బాబును అరెస్టు చేయడం ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు. దాడి చేసే వాళ్లని అరెస్టు చేయకుండా, నిలవరించకుండా ... పోలీసులు ఇలా వ్యవహరించడం ప్ర‌భుత్వం రాజ‌కీయ కుట్ర‌ను చాటుకున్న‌ట్లే క‌దా? అంటూ పేర్కొంటున్నారు. టీడీపీ నిరసనలు చేయడాన్ని వైసీపీ ఎందుకు అడ్డుకుంటుంది?
ఇదేం విచిత్రమైన పాలన? ఇదేం రాజ్యం జగనన్నా?  బాబు అంటే, తెలుగుదేశం అంటే ఎందుకంత భయం అంటూ ప్ర‌వ్నిస్తున్నారు.