దేశంలో ఆ అదృష్టం నా ఒక్క‌డికే ఉంది- చంద్ర‌బాబు

May 25, 2020

నేను చాలా అదృష్ట‌వంతుడిని. భార‌త‌దేశంలో కోటి మంది చెల్లెళ్లు ఉన్న ఏకైక అన్న‌య్య నేనే. ఇంత‌కుమించిన అదృష్టం దేశంలో ఎవ‌రికైనా ఉంటుందా? అంటూ స‌మ్మోహ‌నంగా ప్ర‌సంగించారు చంద్ర‌బాబు. గ‌తంతో పోలిస్తే ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం చంద్ర‌బాబు చాలా కొత్త‌గా చేస్తున్నారు. చాలా ఆగ్రెసివ్‌గా చేస్తున్నారు. దీంతో ప్ర‌సంగం మొత్తం హ‌ర్ష‌ద్వానాలు అరుపులు వినిపిస్తున్నాయి. నాకేమీ అక్క‌ర్లేదు. మీరు సంతోషంగా ఉన్నారా లేదా అన్న‌దే కావాలి... సంతోషంగా ఉంటే చేతులు పైకెత్తండి అంటూ ప్ర‌తి చోటా అడుగుతూ తెలుసుకుంటున్నారు. విచిత్రంగా... అన్ని స‌భ‌ల్లో ఉత్సాహంగా జ‌నం చేతులు పైకెత్తి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌లుకుతూ త‌మ సంతోషాన్ని వ్య‌క్తంచేస్తున్నారు.

చెళ్లెళ్లు అంటూ చంద్ర‌బాబు భ‌రోసా ఇస్తూ చేస్తున్న ప్ర‌సంగం వారిని బాగా ఆక‌ట్టుకుంటోంది. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఫోన్లు ఇస్తాను... అందులో అన్న‌య్యా నాకీ స‌మ‌స్య ఉంది మీరు డైరెక్టుగా నాకు చెప్పొచ్చు. మీరు చెప్ప‌డ‌మే ఆల‌స్యం. ఎంత ఫాస్టుగా వీలైతే ఆ స‌మ‌స్య‌ను అంత ఫాస్టుగా ప‌రిష్క‌రిస్తాను అంటూ అన్నారు. నేనున్న‌దే మీకోసం. మీరు ఆనందంగా ఉండ‌టానికి ఎంత క‌ష్టాన్ని భ‌రించ‌డానికి అయినా సిద్ధ‌మే.

ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల ప్రియ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు బాబు. జ‌గ‌న్‌ని చూస్తే పారిశ్రామిక వేత్త‌లు పారిపోతారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో హామీ ఇస్తున్నా... పైళ్లికానుక ఒక ల‌క్ష అంద‌రికీ ఇస్తాం. పింఛ‌ను మూడు వేలు చేస్తాను. చంద్ర‌న్న భీమా ప‌ది ల‌క్ష‌లు చేస్తాను. జాబు రావాలంటే మ‌ళ్లీమ‌ళ్లీ బాబే రావాలి అని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఏయ్ జ‌గ‌న్ నీకు న‌చ్చి నీకు న‌చ్చితే కేసీఆర్ కాళ్లు మొక్కు మాకేం అభ్యంత‌రం లేదు. కానీ ఏపీని తాక‌ట్టు పెడ‌తాను అంటూ చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌న్నారు.