వెళ్లు ‘‘బాబూ’’ వెళ్లూ.. !

January 21, 2020

అన్నీ తెలిసి తప్పులు చేసే వ్యక్తిగా చంద్రబాబును ఒక మాట అంటే తప్పులేదు. ఏ పార్టీకి అయినా ఇతరుల వల్ల నష్టం జరుగుతుంది. కానీ బాబు పార్టీకి మాత్రం బాబు వల్ల నష్టం జరుగుతుంటుంది. వరల్డ్ పాపులర్ అయ్యి అందరితో పొగిడించుకునే బాబు లోకల్ గాళ్లతో తిట్లు తింటూ ఉంటారు. ఇది మనం ఎక్కడా చూడని కాంబో. ఎందుకంటే... బాబువి కొన్ని స్వయంకృతాపరాధాలు. ఒక్కొక్కసారి ఎక్కువ జ్జానం కూడా మనల్ని దెబ్బతీస్తుంటుంది. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే.
చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలను అణచివేసిన దాఖలాలు లేవు. ఇబ్బంది పెట్టిన చరిత్ర కూడా లేదు. కానీ కొన్ని నిరుపయోగమైన డైలాగులతో అటువైపు వారికి ఆగర్భ శత్రువు అవుతాడు. ఆనాడు వైఎస్ అయినా, ఈనాడు కేసీఆర్, జగన్ లు అయినా.. చంద్రబాబు మీద, ఆ పార్టీ మీద తీవ్రమైన కక్షతో రగిలిపోతారు. పోనీలే వాళ్లంటే తమ పార్టీ కోసం టీడీపీని చంపేయాలనుకోవచ్చు. కానీ... ఎవరెవరో చంద్రబాబు అంతు చూడాలనుకుంటారు. మోత్కుపల్లి, ఐవైఆర్, అంబటి... కొందరు సామాన్యులు, కొందరు అధికారులు ఇలా చంద్రబాబు అంటే మంటెక్కిపోతారు. వారిని చంద్రబాబు ఏం చేశాడో లోకానికి తెలియదు. దేశంలో ఇట్లా చంద్రబాబు తప్ప ఎవరూ తనకంటే ఇంత జూనియర్లతో తిట్లు తినలేదు. ఎందుకిలా చంద్రబాబుకు మాత్రమే జరుగుతుందంటే అది మిలియన్ డాలర్ ప్రశ్న.
మన వరకు మనం ఒక ఉదాహరణ ద్వారా బాబు గురించి కొంచెం తెలుసుకుందాం. ఈరోజు చంద్రబాబును పల్నాడు ప్రాంత కార్యకర్తలు కలిశారు. అక్కడ వైసీపీ వాళ్లు తమను ఎలా ఇబ్బంది పెడుతున్నారో బాబుకు వారు ఏకరువు పెట్టారు. వారి ఆవేదన బాబును కదిలించింది. తీవ్రంగా స్పందిస్తూ జగన్ కి వార్నింగ్ ఇచ్చారు. ‘‘నేరాలను ప్రోత్సహించవద్దని సీఎం జగన్ ను హెచ్చరిస్తున్నాను. పోలీసులతో ఏదైనా చేయొచ్చని సీఎం భావిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చంద్రబాబుకు గత కొంతకాలంగా ఇలాంటి కంప్లయింట్లు వచ్చాయి. అవి విన్నపుడల్లా చంద్రబాబు... అవసరమైన సమస్య తీరే వరకు ఆ పల్లెల్లో నిద్రిస్తా అన్నారు. కానీ వెళ్తానని అనడమే కానీ ఇంతవరకు వెళ్లలేదు. కేవలం మృతిచెందిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వాళ్లను ఆదుకున్నారు. అయితే, అరాచకాలు జరుగుతున్న చోటకు వెళ్లి ఎక్కడా ఒక నిద్ర చేయలేదు. ఏ ఊరిలోనూ తిరగలేదు. ఇలా అయితే... భరోసా ఎలా. బాధ్యతాయుతంగా ఉంటే సరిపోదు కాదా...

ఈ కాలంలో ఎమోషన్లే ఇంపార్టెంట్. డబ్బు కంటే ఎమోషనే పార్టీలకు ప్రాణవాయువు. అది బాబులో ఒక్కోసారి మిస్సవుతుంది. అందుకే ఇలాంటివి అందిపుచ్చుకోలేకపోతున్నారు. వెళ్తాను వెళ్తాను అని కాకుండా ఒకసారి వెళ్లి నిద్ర చేస్తే ఆ రిజల్టే వేరు. మరి ఎక్కడ సమస్య వస్తుందో అర్థం కావడం లేదు. ఎందుకు బాబు ఆగిపోతున్నారో తెలియడం లేదు. 30వ తేదీ పల్నాడు వారితో సమావేశం అవుతాను అన్నారు బాబు. అదేదో పల్నాడులోనే ఈ మీటింగ్ పెడితే సరిపోతుంది కదా.. బాధితులను అమరావతికి రప్పించడం కంటే. ఒకసారి ఆలోచిస్తే బెటరేమో! 

Read Also

లక్ష కోట్లు ఎక్కడ? 1500 కోట్లు ఎక్కడ ?
చంద్రబాబు ట్వీటేస్తే పనులైపోతున్నాయి
బాబు నోటి నుంచి పేటీఎం బ్యాచ్...!