నేను రెచ్చిపోతే కంట్రోల్ చేయలేరు- జగన్ కి బాబు వార్నింగ్

August 03, 2020

తాను ఆలోచనతో, ముందుచూపుతో చేసిన ప్రజెంటేషన్లకు ప్రపంచ ప్రసిద్దుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ వచ్చిందని, అదే మీరు చేసిన పనులకు జైలు జీవితం దక్కిందని బాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. మీరు మాట అదుపులో పెట్టుకోండి, నేను రెచ్చిపోతే నన్ను కంట్రోల్ చేయడం మీ తరం కాదు అంటూ చంద్రబాబు వైసీపీ అధినేతకు, లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు. 

బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ వంటి ప్రపంచ ప్రముఖులకు మన రాష్ట్రం తరఫున నేను చేసిన  బ్రాండింగ్ ఎంతో ఉపాధిని సృష్టించిందని... అవసరమైతే రికార్డులు చూసుకోండని బాబు చెప్పారు. మీరు అనవసరంగా రెచ్చిపోకండి అంటూ చంద్రబాబు హెచ్చరించారు.