జగన్... కాసుకో, వడ్డీతో సహా చెల్లిస్తా !!

August 12, 2020

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన శిద్ధా రాఘరావు ఈరోజు పార్టీ మారిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక పార్టీ మారుతున్నారు, రాబోయే రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ చంద్రబాబు జగన్ ను హెచ్చరించారు. నేతలు పోతే పార్టీ ఉండదనే భ్రమలో జగన్ ఉన్నట్టున్నాడు. పార్టీని నిలబెట్టింది కార్యకర్తలే గాని నేతలు కాదు.

ఇది కార్యకర్తల పార్టీ. నేతలను లాక్కుని పార్టీని పడగొట్టాలనుకుంటే అది మీ భ్రమ అని చంద్రబాబు అన్నారు. పార్టీ మారిన వారికి కూడా చంద్రబాబు కౌంటరు వేశారు. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ పదవులు అనుభవించిన వారు పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ వేధింపులే వీటికి కారణం అన్నారు. అయినా... భయపడి, ప్రలోభాలకు ఆశపడి పార్టీ మారడం పిరికితనం. పార్టీ మారిన వారు కనుమరుగైపోతారన్నా సత్యాన్ని చరిత్ర నిరూపించిందని అన్నారు చంద్రబాబు నాయుడు.

మరో 40 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని పార్టీలో తయారుచేస్తాను. ఆ ఓపిక నాకుంది. యువతతో పార్టీని నింపుతాను అని చంద్రబాబు అన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చి, వైసీపీకి అసలు వడ్డీ రెండూ ఇస్తామన్నారు. 

ఈరోజు టీడీపీ నేత శిద్ధారాఘవరావు పార్టీ మారి జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితం కరణం బలరాం కూడా పార్టీ మారారు. వీరిద్దరు కొడుకుల కోసం, వ్యాపారాల కోసమే పార్టీ మారారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ బలహీన పరిచాలనే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ఈ ఆకర్ష్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.