వైసీపీకి చంద్రబాబు వార్నింగ్

July 13, 2020

చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వైసీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో, మీ ఇష్ట ప్రకారం దాడులు చేయడానికో... తెలుగుదేశం శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తే భయపడిపోతారు అనుకుని భ్రమలతో జీవిస్తూ దౌర్జన్యకాండలకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. వైసీపీ నేతలకు చెబుతున్నాను. మీ వాళ్లను అదుపులో పెట్టుకోండి. కట్టడి చేయండి. ఎక్కడికక్కడ ఈ సంఘటనలను అదుపు చేయండి. శాంతి భద్రతల సమస్య దాకా తేకండి. లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే మాత్రం మీ ఆటలు సాగనివ్వను అంటూ చంద్రబాబు హెచ్చరించారు.

ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సకల బాధలు పడుతున్నారు. అన్ని వ్యవస్థలను పాడు చేశారు. మీరు వెంటనే ఈ పనికిమాలిన పనులు ఆపి పాలనను సక్కదిద్దక పోతే... ప్రజలు చేయాల్సింది ప్రజలు చేస్తారు. మేము చేయాల్సింది మేము చేస్తాం అంటూ వైసీపీ అధినేతను బాబు హెచ్చరించారు.