బాబుదే విజయం! నిపుణుల సపోర్ట్ తో ఈసీకి భంగపాటు

August 06, 2020

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా తెలంగాణలో ఈవీఎంల కారణంగా జరిగిన మోసం, నేడు ఏపీ లోని పరిస్థితులతో దేశ వ్యాప్త సంచలనంగా మారిందీ అంశం. ఈవీఎంల వల్ల దేశ ప్రజాస్వామ్యానికి లోటు తప్పదని వాదిస్తున్న పోరాడుతున్న చంద్రబాబు సహా విపక్ష నేతలకు విజయం తధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈవీఎంలకు అనుసంధానించే వీవీప్యాట్‌ స్లిప్పులను ప్రతి నియోజకవర్గంలో 50 శాతం చొప్పున లెక్కించాల్సిందేనని చంద్రబాబు ఢిల్లీ వేదికగా తెలిపారు. ఇందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని బాబు ప్రకటించారు. ఈ డిమాండ్‌తో బీజేపీ మినహా 15 ప్రాంతీయ పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఏకీభవిస్తున్నాయని ఆయన చెప్పారు.

ఎన్నికల ప్రక్రియపై ఓటర్లలో విశ్వాసం, విశ్వసనీయత తీసుకురావడమే తన లక్ష్యమని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు చంద్రబాబు ప్రకటించారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర ప్రతిపక్షాలతో సమావేశమైన బాబు.. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణతో పాటు ఈవీఎంల వైఫల్యం, వీవీప్యాట్‌ల లోపాలపై గంటసేపు చర్చించారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరగాలన్న డిమాండ్‌ను పూర్తిగా సమర్థించారు. అనంతరం ఆయా పార్టీల నాయకులతో కలసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వీవీప్యాట్‌ స్లిప్‌లలో ఓటరు పేరు, ఓటు వేసిన పార్టీ గుర్తు 7 సెకన్లు కనిపించాల్సి ఉండగా 3 సెకన్లే కనిపించే వీడియో క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. నవ్యాంధ్రలో ఎన్నికలు ముగిశాయని, ఇక ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలలో ఈవీఎం లోపాలపై అందరినీ అప్రమత్తం చేయడానికే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశానని చంద్రబాబు వెల్లడించారు. ‘ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు కారణంగా పోలింగ్‌ కేంద్రాల్లో వందలాది ఓటర్లు తెల్లవారుజాము వరకు ఓటు వేసేందుకు వేచిఉండాల్సి రావడం దారుణం. చివరకు మా రాష్ట్ర సీఈవో కూడా తన ఓటు హక్కును మధ్యాహ్నం 2గంటల వరకు వినియోగించుకోలేక పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీవీప్యాట్‌ స్లిప్‌లలో ఓటరు పేరు, ఓటు వేసిన పార్టీ గుర్తు 7 సెకన్లు కనిపించాల్సి ఉండగా 3 సెకన్లే కనిపించడాన్ని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) దృష్టికి తీసుకెళ్తే స్పష్టమైన సమాధానం లేదు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపునకు ఆర్రోజులు పడుతుందని కమిషన్‌ వాదించడం విడ్డూరం.. అన్నారు చంద్రబాబు.

నేను కూడా 1978 నుంచి ఎన్నికల్లో పాల్గొంటున్నాను. అప్పట్లో బ్యాలెట్‌ పత్రాల లెక్కింపునకు మహా అయితే 24 గంటలు పట్టేది. ఈవీఎంల నిర్వహణకు ఈసీ నియమించిన సాంకేతిక సిబ్బంది గంటల కొద్దీ ఈవీఎంలు మొరాయిస్తే చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప తక్షణం వాటిని సరిచేయలేకపోయారు. ప్రపంచంలోని 191 దేశాల్లో 18 వర్ధమాన దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. జర్మనీ, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌ లాంటి దేశాలు కూడా ఈవీఎంలు వద్దనుకుని మళ్లీ బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు జరుపుతున్నాయి. ఆరు నెలలకే సెల్‌ ఫోన్లు మార్చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా మనం ఏళ్ల తరబడి అవే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. రూ.9,000 కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్లు ప్రవేశపెట్టారు. వాటిని సంపూర్ణంగా ఉపయోగించుకోకపోతే వ్యర్థం. 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు జరగాలన్న మా డిమాండ్‌ చాలా సహేతుకం. కానీ బీజేపీ అడ్డుపడుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టెక్నాలజీని దుర్వినియోగం చేశారు. 25 లక్షల మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారు. పోలైన ఓట్లకు, మొత్తం ఓటర్ల సంఖ్యకు చాలా తేడా ఉంది. ఇందుకు ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ అధికారులు క్షమాపణ చెప్పిన సంగతి కూడా మనకు తెలుసు. ఏపీలో కూడా ఫామ్‌-7 ద్వారా 7 లక్షల ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరిగింది. మేం సకాలంలో చర్యలు తీసుకోవడంతో పరిస్థితి చేయదాటిపోలేదు అని చెప్పారు బాబు. అయితే చంద్రబాబు మాటలను కాంగ్రెస్ నేత కపిల్‌ సిబల్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సమర్ధించడం గమనార్హం.