టీడీపీకి సెంటిమెంట్ టెన్ష‌న్‌...బాబు బ్రేక్ చేయ‌డం ఖాయం

July 21, 2019

ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరులో అంద‌రి చూపు అధికార తెలుగుదేశం పార్టీపై ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు కేంద్రం నుంచి స‌హ‌కారం లేక‌పోవ‌డం...మ‌రోవైపు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీలతో పోరాటం చేస్తున్నప్ప‌టికీ, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తిరిగి అధికారం నిల‌బెట్టుకునేందుకు త‌న‌దైన శైలిలో క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో తాజాగా టీడీపీ గురించి ఓ సెంటిమెంట్ అంశాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చిన చరిత్ర లేక‌పోవ‌డం గురించి ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. 1994లో కనీవినీ ఎరుగని ప్రభంజనంతో ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారాన్ని చేపట్టింది. అనంత‌రం ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు అధికారం స్వీక‌రించారు. చంద్రబాబు నేతృత్వంలో తొలిసారి తెలుగుదేశం 1999 ఎన్నికల్లో పోటీకి దిగింది. అప్పుడు విజయం సాధించిన చంద్రబాబు.. తర్వాత 2004 ఎన్నికల్లో పరాజ‌యం మూటగట్టుకున్నారు. ఆపై 2009 ఎన్నికల్లోనూ అధికారాన్ని దక్కించుకోలేకపోయారు.

రాష్ట్ర విభజన దరిమిలా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్త‌న్నారు. రాజకీయ ప్రతికూలతలన్న‌ప్ప‌టికీ అభివృద్ధి, సంక్షేమ పాల‌న‌తో ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీకి ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని విశ్లేషకులు చెప్తున్నారు.