చంద్రబాబు సరే, వైసీపీ ఎమ్మెల్యేలకైనా తెలుసా ఆ సంగతి?

May 24, 2020

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వైసీపీ చోటామోటా నాయకులకు కూడా పెద్ద టార్గెట్ అయిపోయారు. చంద్రబాబును విమర్శించి వైసీపీలో పార్టీ పెద్దల వద్ద మార్కులు కొట్టేయాలన్న ఆత్రుత అందరిలో ఎక్కువైపోయింది. ఆ క్రమంలో చంద్రబాబును విమర్శించేవారు, సవాళ్లు విసిరేవారు వైసీపీలో పెరిగిపోతున్నారు. ఆ క్రమంలో చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న విమర్శల్లో క్వాలిటీ తగ్గిపోతోంది. విమర్శల్లో పదును లేకపోవడంతో ఒక్కోసారి అవి రివర్సయి వైసీపీకే ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా వైసీపీకి చెందిన ఓ నేత చంద్రబాబు తన ప్రశ్నకు సమాధానం చెబితే రూ. లక్ష బహుమతి ఇస్తానని ప్రకటించారు. అయితే.. అదే ప్రశ్నకు జవాబు వైసీసీ ఎమ్మెల్యేలకు తెలుసోలేదో తొలుత కనుక్కోమని టీడీపీ నేతలు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు.
వైసీపీకి చెందిన బి. వై. రామయ్య అనే నాయకుడు చంద్రబాబుకు ఓ ప్రశ్న వేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లన్నింటినీ చెబితే లక్ష బహుమతి ఇస్తానని అన్నారు.  చంద్రబాబు కర్నూల్ జిల్లా అభివృద్ధిని విస్మరించారని, అసలు చంద్రబాబు కు ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ముందుగా ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు వైసీపీ నేత రామయ్య. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నపుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపిన రామయ్య, ప్రతి పక్ష నేతగా కూడా అట్టర్ ప్లాప్ అయ్యారంటూ పడిగట్టు విమర్శలు కొన్ని చేశారు.
అయితే, రామయ్య విమర్శలపై టీడీపీ నేతలు రివర్సయ్యారు. అసలు మీ పార్టీలో ఎంతమందికి తెలుసో ముందు కనుక్కో.. ఆ తరువాత చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవచ్చంటూ తలంటారు. అంతేకాదు.. విపక్ష నేతగా చంద్రబాబే కాదు ఎవరైనా ఆ మాత్రం పరిశీలన లేకుండా రాజకీయాలు చేయలేరన్న సత్యం తెలియకుండా చంద్రబాబునే ప్రశ్నిస్తున్నారని.. చంద్రబాబుకు లక్ష రూపాయల బహుమతి ఇచ్చే మొహమేనా నీది అంటూ మండిపడుతున్నారు. 

Read Also

జగన్‌ను ఇబ్బంది పెట్టేస్తున్న తెలంగాణ, కర్ణాటక
ఏపీలో మంత్రులంతా జీరోలే... అంతా జగన్ మయం !!
జగన్ అడ్డాలో పవన్... స్పీచ్ దంచేశాడు