న‌వ నిర్మాణ సార‌థికే అమ‌రావ‌తి ప‌ట్టం!

July 21, 2019

ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు. ఎంతోమంది పార్టీ నాయ‌కుల దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కొంద‌రు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంకేముంది టీడీపీ భూస్థాపితం అనుకున్నారు. చంద్ర‌బాబునాయుడు మ‌ళ్లీ సీఎం కావ‌టం క‌ష్ట‌మ‌న్నారు. జ‌గ‌న్‌పై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. రేపోమాపో సీఎం అంటూ జ‌గ‌న్ అండ్ బ్యాచ్ ఊద‌ర‌గొట్టింది. స‌ర్వేలు.. అన్నీ అటే వంత‌పాడాయి. అటువంటి క్లిష్ట‌మైన వాతావ‌ర‌ణంలో.. చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌లు చాక‌చ‌క్య‌త‌.. రాజ‌నీతి ప‌రిణితిగ‌ల నాయ‌కుడి వ్య‌వ‌హ‌రించి చ‌క్క‌దిద్దారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబునాయుడు అనుభ‌వాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ముఖ్యంగా.. విద్యావంతులు, యువ‌త పూర్తిగా న‌మ్మారు. హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దిన నాయ‌కుడు.. కొత్త రాష్ట్ర సార‌థిగా.. న‌వ‌నిర్మాణ వార‌ధిగా.. అమ‌రావ‌తిని నిర్మించ‌గ‌ల వ్య‌క్తిగా భావించారు. అందుకే.. ఏరికోరి అమ‌రావ‌తి ప్రాంతాన్ని రాజ‌ధానిగా మార్చారు. నాలుగేళ్ల‌పాటు బీజేపీతో స్నేహం నెరిపినా.. మోదీ నుంచి సాయం అంద‌లేదు. పైగా ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాక‌ట్టు పెట్టాలా! అనే సందిగ్థ‌త నెల‌కొంది. రైల్వేజోన్‌, ప్ర‌త్యేక‌హోదా కాదంటే క‌నీపం ప్యాకేజీ దేనికి ఎన్‌డీఏ కూట‌మి అంగీక‌రించ‌లేదు. దీంతో చివ‌ర్లో క‌ష్ట‌మ‌ని సీనియ‌ర్‌లు వారించినా.. కేసులు ఉంటాయ‌ని హెచ్చ‌రించినా విన‌కుండా చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఢిల్లీ ద‌ద్ద‌రిల్లేలా.. మోదీ క‌ళ్లెదుట జాతీయ‌స్థాయిలో బలాన్ని కూడ‌గ‌ట్టి హోదాపై నిన‌దించారు. తెలుగోడి పౌరుషం ఎంత వాడిగా.. వేడిగా ఉంటుందో రుచిచూపారు. బీజేపీ నేత‌లు సైతం కంగుతిని కాళ్ల‌బేరానికి వ‌చ్చేంత పోరాటం ధ‌ర్మంగా సాగించారు. మ‌రోసారి ఎన్నిక‌లు వ‌చ్చాయి. గ‌తానికి కంటే అధికమైన ఒత్తిడితో చంద్ర‌బాబు ఉన్నారు. చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. వాటిని పూర్తిచేయాలంటే.. ఎవ‌రో రావాలి. ఆది చంద్ర‌బాబు కావాలి అనేంత‌గా.. ఏపీ ఓట‌ర్లు భావిస్తున్నారు. డేటాచోరీ తిరిగి కేసీఆర్‌, జ‌గ‌న్ కోట‌రీ మెడ‌కు చుట్టుకోవ‌టం టీడీపీలో మ‌రింత ఉత్సాహాన్ని నింపింది. ఎన్‌టీఆర్ గృహాలు.. క్యాంటీన్లు.. ప‌సుపు కుంకుమ‌.. ఇలా ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కం ఇంటింటా.. ప‌సుపు గూటిపై మ‌రింత న‌మ్మకాన్ని పెంచేలా చేసింది. బీజేపీ ద్రోహం చేయ‌టం వ‌ల్ల‌నే రాష్ట్ర ప్ర‌గ‌తి కుంటుప‌డింద‌ని, క‌నీసం విజ‌య‌వాడ ఫ్ల‌యిఓబ‌ర్ పూర్తిగాక‌పోవ‌టానికి కూడా కేంద్ర‌మే కార‌ణ‌మ‌నేంత‌గా ప్ర‌జ‌లు బీజేపీపై వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. పోల‌వ‌రం అడ్డుకునేందుకు కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో క‌విత‌, కేటీఆర్ వేసిన కేసులు కూడా ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌ను పెంచుతున్నాయి. ప‌క్కింట్లో శుభ‌కార్యం జ‌రిగితే.. మా ఇల్లు అలుక్కోవాలా అంటూ.. ఏపీ అభివృద్ధిపై టీఆర్ ఎస్ మంత్రులు చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. అటువంటి పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకోవ‌టం.. దీనికి ఎంఐఎం వంటి పార్టీ వంత‌పాడ‌టం కూడా ఏపీలో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. మ‌రోసారి చంద్ర‌బాబును ఎన్నుకోవ‌టం ద్వారా ప్రారంభ‌మైన అభివృద్ధి పనులు కొన‌సాగుతాయ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. న‌వ‌నిర్మాణ సార‌ధికే ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధ‌మంటూ.. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌ల‌న్నీ దాదాపు లెక్క‌గ‌ట్టాయి. ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త ఉన్నా.. కేవ‌లం చంద్ర‌బాబు నాయ‌క‌త్వం కోసం జ‌నం టీడీపీను భారీ మెజార్టీతో టీడీపీను మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌టం ఖాయ‌మంటూ టీడీపీ వ‌ర్గాలు ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తంచేస్తున్నాయి.