బాబును ఇర‌కాటంలో పెడుతున్న రెబెల్స్‌

September 17, 2019

ఎన్నిక‌లు అన‌గానే రాజ‌కీయ పార్టీలు ఆశించిన వారంద‌రికి టికెట్లు ఇవ్వ‌డం క‌ష్ట‌మే. అయితే విజ‌య‌వ‌కాశాలు అధికంగా ఉన్న వారికి టికెట్టు ఇచ్చి మిగ‌తా వారిని బుజ్జ‌గించ‌డం కొత్తేమి కాదు. విన్న వారికి కాస్త ప్రాధాన్యం ఉంటుంది. మిగ‌తా వారు ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స వెళుతుంటారు. కాని ఇలాంటి రెబెల్స్ కార‌ణంగా పార్టీలు న‌ష్ట‌పోయిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీలో కూడా రెబెల్స్ బెంగ మొద‌లైంది. నర్సాపురం టిక్కెట్టు ఈసారి తనకే తగ్గుతుందని గంపెడాశలు పెట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కు చంద్రబాబు షాక్ ఇచ్చారు. దాంతో అలిగిన సుబ్బారాయుడు వెనువెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి, ఉత్తరాంధ్ర టిడిపి ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు. అనుచరులు కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ గూటికి చేరాల, లేదా జనసేన గూటికి చేరాల అనే సందిగ్ధంలో సుబ్బారాయుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇది కుదరని పక్షంలో టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన సిద్ధమయ్యారట.

ఇకపోతే నందమూరి యువసేన జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రామకృష్ణ చౌదరి భీమవరం టిక్కెట్టు ఆశించారు అయితే చంద్రబాబు మరోసారి పులపర్తి రామాంజనేయులు సీటు కేటాయించడంతో అసంతృప్తికి గురైన చెరుకూరి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ మేరకు ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు చంద్రబాబు ని నమ్ముకుని పార్టీ లోకి వచ్చింది మొదలు ఎన్ని అవమానాలు జరిగినా, మంత్రి పదవి పోయినా, తన వెనక ఓ సామాజిక వర్గం ఎన్ని కుట్రలు చేసినా టిడిపినే అంటిపెట్టుకుని ఉన్న మాజీ మంత్రి చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత కి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆమె అనుచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్రా రాజారావు నామినేషన్ కార్యక్రమానికి పీతల వర్గం డుమ్మా కొట్టేసింది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే సీటు ఇవ్వలేదని అందరిలా చంద్రబాబు ని కానీ , టీడీపీ పార్టీని కాని ఒక్క మాట కూడా విమర్సించక పోవడం పీతల సుజాత కి పార్టీపై ,చంద్రబాబు పై ఉన్న గౌరవం ఏ స్థాయిలో ఉందో మరో సారి అందరికి తెలిసి వచ్చిందని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. అయితే గత ఎన్నికల్లో లో పశ్చిమ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో మాత్రం కొంతమంది నేతల మాటలు విని కీలక నేతలతో టిక్కెట్లు ఇవ్వకపోవడంతో ఆయా స్థానాలలో లో టీడీపీ ఓటమి చవి చూడటం తప్పదని అంటున్నారు రాజకీయ పండితులు.