ఒక్క వీవీ పాట్ స్లిప్ తేడా వచ్చినా...

July 03, 2020

ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకి బ్రహ్మరథం పట్టినా... ఎన్డీయేత పక్షాలు పోరాటం ఆపడం లేదు. 21 పార్టీల నేతల ఈవీఎం గ్యాంబ్లింగ్ ను ఎలాగైనా అడ్డుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. కచ్చితంగా ఉత్తరాదిలో ఏదో జరుగుతోందని, ఈ గ్యాంబ్లింగ్ లో భాగమే ఎగ్జిట్ పోల్స్ అని... బీజేపీకి వ్యతిరేకత ఉందని స్వయంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అందుకే ఎక్కడ అవకాశం వచ్చినా మోడీ మాయ నుంచి ఈవీఎంలలో ప్రజాతీర్పును రక్షించడానికి చంద్రబాబుతో పాటు అందరూ ప్రయత్నం చేస్తున్నారు మళ్లీ మళ్లీ కేసులు వేస్తున్నారు. ఎన్నికల సంఘంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఒక వ్యాఖ్య గమనించదగ్గది... ప్రజలలో ఈవీఎంలపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత, అంతా సాఫీగా జరుగుతున్న భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఈరోజు  చంద్ర‌బాబు నాయుడు స‌హా 21 పార్టీల నేతలు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ త‌ర‌ఫున గులాం న‌బీ ఆజాద్‌, అబిషేక్ సింఘ్వీ, అశోక్ గెహ్లాట్‌, స‌మాజ్‌వాది పార్టీ నుంచి రామ్‌గోపాల్ యాద‌వ్‌, సీపీఎం జాతీయ కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నాయ‌కురాలు క‌నిమొళి ఇలా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా ఇక్కడ చర్చించుకున్న తర్వాత కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యానికి వెళ్లి అక్కడ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాండమ్ గా ఎంచుకున్న ఐదు వీవీపాట్లను ముందుగా లెక్కించాలని, తప్పు వస్తే ఆ నియోజకవర్గం మొత్తం వీవీ పాట్లు లెక్కించాలని  ఈ సందర్భంగా అరోరాకు విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించినా నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేయడంతో వీవీ పాట్లను లెక్కించడానికి ఈసీకి ఉన్న ఇబ్బందేంటని చంద్రబాబు మీడియాతో ప్రశ్నించారు. ఒక రక్తపు బొట్టు ఆధారంగా అన్ని వ్యాధులు గుర్తించడం ఎలా సాధ్యం కాదో.. అలాగే ఒకటో ఐదో వీవీ పాట్లు లెక్కించినా పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. మా వాదనను అంగీకరించడం వల్ల కొంచెం సమయం పెరగడం తప్ప ఏ ఇబ్బంది లేదని, పైగా దీనివల్ల పారద్శకత వస్తుందని అన్నారు.