చరణ్ రికార్డును తాకలేకపోయిన చిరు

August 08, 2020

ఆయన ఒకప్పటి మెగాస్టార్ అయ్యిండొచ్చు. 60వ పడిలోనూ యువ హీరోలతో పోటీపడుతూ ఉండొచ్చు. కానీ కొడుకు రికార్డును కూడా దాటలేకపోయాడు. అమెరికాలో టాప్ టెన్ కలెక్షన్స్ లో చిరంజీవి కొడుకు రికార్డుకు దూరంగా నిలబడిపోయారు. తెలుగు సినిమాలు ఓవర్సీస్ కలెక్షన్ల టాప్ 10 జాబితాలోకి అతి కష్టం మీద చేరిన చిరంజీవి సైరా సినిమా... పదో స్థానంలో నిలిచిపోయింది. మొదటి రెండుస్థానాలు పర్మనెంట్గా బాహుబలికి అంకితం అయిపోయాయి. మళ్లీ ఈ స్థానాల్లోకి #RRR వస్తుందో రాదో తెలియదు. ఇప్పటికైతే... రాజమౌళి తర్వాత సుకుమార్ నిలబడ్డాడు. వాస్తవానికి బాహుబలి, రంగస్థలం మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. వాటిని డైరెక్టర్ సినిమాలుగానే చెప్పాలి. రాజమౌళి సుకుమార్ లకు ఓవర్సీస్ పిచ్చ క్రేజ్ ఉంది. అయితే... వారి క్రేజుకు సరైన హీరోలు పడటం వల్లే ఆ రికార్డులు సాధ్యం అయ్యాయి.

ఇక టాప్ 10 జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బాహుబలి 2 సినిమా 20.5 మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించగా... రెండోస్థానంలో బాహుబలి బిగినింగ్ 6.9 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో నిలిచింది. మూడో స్థానంలో రంగస్థలం 3.51 మిలియన్ డాలర్లు సాధించింది. ఆ తర్వాత వరుసగా భరత్ అనే నేను, సాహో, శ్రీమంతుడు, మహానటి, గీతగోవిందం, అ..ఆ.. ఉన్నాయి. పదో స్థానంలో నిలిచిన సైరా నరసింహా రెడ్డి 2.4 మిలియన్ డాలర్లు మాత్రమే సాధించాడు.