సెలబ్రిటీ కపుల్స్ పై ఛీటింగ్ కేసు

August 13, 2020

బాలీవుడ్ లో సెలబ్రిటీ కపుల్స్ కు కొదవ లేదు. అయితే.. అన్యోన్యంగా ఉండే సెలబ్రిటీ కఫుల్స్ కొద్ది మందే కనిపిస్తారు. చాలామందికి సంబంధించి ఏదో ఒక వివాదం వారితో ముడిపడి ఉంటుంది. వ్యక్తిగత బంధానికి సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ ఇప్పటివరకూ రాకున్నా.. తరచూ వివాదంలో వినిపించే స్టార్ కపుల్ గా బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా పేర్లు వినిపిస్తాయి. ఐపీఎల్ ఎపిసోడ్ లోనూ.. ఆ తర్వాత పలు వివాదాల్లోనూ శిల్పా భర్త పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది.
తాజాగా మరో వివాదంలో ఆయన ఇరుక్కున్నారు. ముంబయి పోలీసులు రాజ్ కుంద్రా మీద ఛీటింగ్ కేసు నమోదైంది. సత్యయుగ్ గోల్డ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తనను మోసం చేసిందని సచిన్ జోషి అనే ఎన్ ఆర్ ఐ కంప్లైంట్ చేశారు. 2014లో ఈ కంపెనీ ఐదేళ్లకు సంబంధించి ఒక గోల్డ్ స్కీం ప్రకటించిందని.. అందులో భాగంగా రూ.18.58 లక్షలకు క కేజీ బంగారాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
దీనికి సంబంధించి తనకో కార్డు ఇచ్చినట్లుగా చెప్పారు. ఐదేళ్లు గడిచిన తర్వాత శిల్పాశెట్టి.. రాజ్ కుంద్రాలు చెప్పినట్లుగా తనకు కేజీ బంగారాన్ని ఇవ్వలేదన్నారు. దీంతో గోల్డ్ స్కీమ్ ప్రకారం తాను పెట్టుబడి పెట్టిన డబ్బులకు తగిన బంగారాన్ని తీసుకోవటానికి వెళితే.. అప్పటికే కంపెనీని మూసివేశారన్నారు. ఈ నేపథ్యంలో తాను శిల్పా దంపతుల్ని సంప్రదించగా.. తాము సదరు కంపెనీ నుంచి 2017లో రాజీనామా చేసినట్లుగా వెల్లడించారు. దీంతో.. తానీ గోల్డ్ స్కీ్ంలో మోసపోయిన వైనాన్ని గుర్తించినట్లుగా చెప్పుకున్నారు. దీంతో.. వారిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. మరీ.. ఛీటింగ్ కేసు నుంచి ఈ సెలబ్రిటీ కపుల్స్ ఎలా బయటపడతారో చూడాలి.