నటి అంజలిపై కేసు పెట్టాలంటున్నారు

February 19, 2020

సినీ నటి అంజలికి కొత్త సమస్యలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె చేసిన ఒక వాణిజ్య ప్రకటన కొత్త తిప్పలు తెచ్చి పెట్టింది. ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తున్నారన్న ఆరోపణను ఆమె ఎదుర్కొంటున్నారు. నటి అంజలికి ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం ఏమిటి? ఇంతకీ ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందన్న విషయంలోకి వెళితే..
ఒక వంట నూనె ప్రకటనలో అంజలి నటించింది. ఆ నూనెను కోవై సుడర్ పార్వై మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్య గాంధీ ఒక ల్యాబ్ లో పరీక్షలు జరిపారు. అనూహ్యంగా ఆ వంట నూనెలో కల్తీ ఉందన్న విషయం తేలింది. ఇలాంటి వంటనూనెలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయని మండిపడిన ఆయన.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఒక సినీ నటి వంట నూనెకు ప్రచారకర్తగా నటించటం ద్వారా.. ఆమె మీద నమ్మకంతో ఆ బ్రాండ్ కొనుగోలు చేసే వారంతా మోసపోతున్నట్లే కదా? అన్నది ఆయన క్వశ్చన్. ఇలాంటి హానికరమైన నూనెల్ని వాడటం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల్ని మోసం చేయటమేనని ఆయన చెబుతున్నారు. అందుకే.. అంజలిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.
ఇటీవల వెయిట్ లాస్ ప్రకటనలో నటించిన నటీమణులు రంభ.. రాశిలకు ఇటీవల కోర్టు హెచ్చరికలు చేయటం.. ఆ వాణిజ్య ప్రకటనను ప్రసారం చేయకుండా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. సినీ.. క్రీడా ప్రముఖులు ప్రజల్లో తమకున్న ఆదరణను సొమ్ము చేసుకునేలా ప్రకటనల్లో నటించటం తెలిసిందే.
వారికున్న ఇమేజ్ తో తమ బ్రాండ్ ను పాపులర్ చేసుకోవాలనుకునే వ్యాపారసంస్థ ఆలోచన మంచిదైతే ఓకే కానీ.. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచన ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రముఖుల మీద చర్యలు తీసుకోవటమే మార్గం. ఇప్పటికే వచ్చిన కొత్త చట్టం ఇలాంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రముఖులు.. సెలబ్రిటీలు తాము నటించే యాడ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. లేకుంటే చిక్కులు తప్పవంతే. 

Read Also

హంసా నందిని లేటెస్ట్ అండ్ హాటెస్ట్
ఈ పిచ్చి ఆగదా సామీ...
ట్విట్టరులో గోపాల్ దాస్ వర్మాచంద్ రాంధీ హల్ చల్