నగరిలో రోజాకి చెక్! టీడీపీ భారీ వ్యూహం..!

December 12, 2019

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, చంద్రబాబు వైపే ప్రజానాడి కొట్టుకుంటోంది. అభ్యర్థి ఎవరనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా టీడీపీకే మా ఓటు అనే స్థాయిలో ఉన్నారు ఏపీ ప్రజానీకం. ఓవైపు అంతలా అక్కడి ప్రజానీకం బాబును నమ్ముతుంటే ప్రతిపక్షాలు మాత్రం తమ మేలు కోసం కొత్త కొత్త కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు నియోజక వర్గాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. నగరి నియోజకవర్గానికి తిరుగులేని నేతగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడి తనయుడు భానుప్రకాష్‌కు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. 2014 నుంచి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు భానుప్రకాషే చూసుకుంటున్నారు. ముద్దుకృష్ణమనాయుడు చేసిన సేవలు, ఆయన లేరన్న సానుభూతి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని .. భానుప్రకాష్ నమ్మకంగా ఉన్నారు. రోజా.. సంప్రదాయ ఓటు బ్యాంక్‌తో పాటు తమిళుల ఓట్లను పొందేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పుత్తూరు, నగరి మున్సిపాలిటీల పరిధిలో సెల్వమణి సామాజిక వర్గం సింగుందర్‌ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో రోజా.. నియోజకవర్గంలో చేసేందేమీ లేదు. కనీసం ప్రభుత్వ పథకాలు అయినా ప్రజలకు అందించే ప్రయత్నం ఆమె చేయలేదు. కానీ ఇప్పుడు ఓటు ఆశిస్తోంది. ఇదెంతవరకు సమంజసమో ప్రజలు గ్రహిస్తున్నారు.

ప్రభుత్వం సహకరించలేదంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చోవారా చూపని రోజా.. అందరితోనూ దురుసుగా ప్రవర్తిస్తూ వచ్చారు. తీరా ఎన్నకలు రావడంతో ఇప్పుడదే ఆమెకు పెద్ద మైన్స్ పాయింట్ అయింది. ఇక ఈ సారి తమిళ ఓటర్ల విషయంలో.. టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. డీఎంకే అధినేత స్టాలిన్‌, కమల్ హాసన్ వంటి వారు.. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. స్టాలిన్‌తో .. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయించుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒక వేళ స్టాలిన్ రాకపోయినా తమిళ ఓటర్లను టీడీపీ వైపు మళ్లించేందుకు డీఎంకే నేతలతో తెర వెనుక ప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితులను బట్టి చూస్తే.. ఆర్కే రోజాకు ఈ సారి విజయమనేది అంత తేలిక కాదని అర్థమవుతోంది. టీడీపీలో ఉన్నంత కాలం.. ఓ సారి నగరి నుంచి.. మరోసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆమె.. వైసీపీలో చేరిన తర్వాత నగరి నుంచి.. అతి కష్టం మీద.. 858 ఓట్ల లోపు తేడాతో విజయం సాధించారు. దానికి కారణం.. ఆమె భర్త సెల్వమణి ప్రచారం చేయడం. గత ఎన్నికలకు ముందు సెల్వమణి.. శ్రీలంక తమిళుల విషయంలో… కాస్త హడావుడి చేశారు. అరెస్ట్ కూడా అయ్యారు. ఆ సానుభూతి ఓట్లు రోజాకు లభించాయి. దాంతో విజయం సునాయాసం అయింది. కానీ ఈ సారి చంద్రబాబు పాలనా దక్షత చూసిన తమిళులు సైతం టీడీపీ వైపే మొగ్గుతున్నారు. దీంతో నగరిలో రోజా పరాజయం ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.