చీరాల ... వైసీపీకి  చిరిగి చాటవుతోంది

August 14, 2020

చీరాల నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు

అదేంటి ఎక్కడైనా ఎమ్మెల్యే ఒక్కరే కదా అనుకుంటున్నారేమో 

వైసీపీ కదా ఇలాగే ఉంటుంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కరణం బలరాం ఎంతో, ఆమంచి కృష్ణమోహన్ అంతే.

ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో ముందు నుంచి ఆమంచి వర్సెస్ కరణం బలరాం నడుస్తోంది. నిజానికి కరణం అనుభవంతో గాని, వయసుతో గాని పోల్చినపుడు ఆమంచి చాలా చిన్నవాడు. చంద్రబాబు కంటే కరణం బలరాం సీనియర్. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి మొన్నటి వరకు టీడీపీలోనే కొనసాగిన కరణం బలరాం... రాజకీయం చివరి దశలో పార్టీ మారి తన స్థాయిని తానే తగ్గించుకున్నారు. 

పోనీ... ఏదో రాజకీయ అవసరాలు, కొడుకు బలహీనత అనుకుందాం. అంత అనుభవం ఉన్న నేత పార్టీ మారితే ఎలా ఉండాలి. చేరిన పార్టీలో చక్రం తిప్పాలి. మంత్రిలా హవా కొనసాగించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జూనియర్లు కూడా పార్టీ మారి మంచి పదవులు కొట్టేశారు. కానీ డొక్కాకున్న విలువ కూడా కరణం బలరాంకి దక్కలేదు. కొడుకును ఎమ్మెల్సీగా కూడా చేయలేకపోయారు. పార్టీకి జీహుజూర్ అంటూ ఇంకా గల్లీ రాజకీయాలు చేసుకుంటున్నారు.

చివరకు నియోజకవర్గంలో తనకంటే ఎంతో జూనియర్ అయినా ఆమంచిపై పై చేయి సాధించడానికే కరణం టైం అంతా సరిపోతుంది. కరణం వంటి సీనియర్ పార్టీలో ఉన్నపుడు, అది కూడా ఎమ్మెల్యేగా ఉన్నపుడు అధికారులు అయినా ఎవరైనా ఆయన గ్రిప్ లో ఉండాలి. కానీ అదేం జరగడం లేదు. 

నియోజకవర్గంలో కరణం మాట కాదని అపుడపుడు అధికారులు ఆమంచి మాట కూడా వింటున్నారు. అది కూడా కరణం ఆలోచనలకు విరుద్ధంగా ఆమంచి మాట వింటున్నారు. ఒక్కోసారి కరణం బలరాం మాటయినా జరుగుతుందో లేదో గాని ఆమంచి మాట జరుగుతోంది. అతను ఒక షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. పోనీ అతనేమైనా ముందు నుంచి వైసీపీ నేత అంటే అదీ కూడా కాదు. ఎన్నికల ముందు వైసీపీలో చేరి కరణం చేతిలోనే ఓడిపోయాడు.

సప్తసముద్రాలు దాటి బురదగుంటలో పడినట్టు... టీడీపీలో శిఖరంలా బతికి, అంతకుముందు కాంగ్రెస్ లో ఇందిరగాంధీ తో వన్ ట వన్ మీటింగులు పెట్టిన మహా రాజకీయ నేత ఈరోజు ఇలా ఆమంచి వంటి నియోజకవర్గ స్థాయి లీడరుతో పోరాటంలో తన చరమాంకం గడిపేస్తున్నారు. కుమారుడు కూడా చేతికి వచ్చినా... తండ్రీకొడుకు ఇద్దరు కలిసి ఆమంచిపై పైచేయి సాధించలేకపోతున్నారు. హతవిధీ... ఏమిటి కరణం గారు మీ పరిస్థితి.