చెన్నై ఐటీ కంపెనీల్లో క్యాంటీన్ల మూసివేత‌ - ఎందుకంటే

August 03, 2020

అప్పటికి రెండు మూడు దశాబ్దాలుగా ప్రకృతి సిగ్నల్ ఇస్తున్నా మనం పట్టించుకోవడం లేదు. కానీ కొంపలు మునిగే సమయం దాపురించింది. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ లో నీళ్లు అయిపోయాయట. ఈ పరిస్థితికి మనం కూడా దగ్గరగా ఉన్నాం. తప్పు ఎవరిదో కాదు మనదే. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. నీటి కరవుతోనే చెన్నై ఐటీ ఆఫీసులు క్యాంటీన్లను మూసేశాయి.

కొంతకాలం క్రితం కరవు వల్ల మ‌హారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల‌కు నీళ్ల‌ను రైళ్ల‌లో స‌ర‌ఫ‌రా చేసిన విచిత్రం చూశాం. తాజాగా ఇప్పుడా అలాంటి ఘోరం త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై మ‌హాన‌గ‌రానికి దాపురించింది. భూగ‌ర్భ జ‌లాలు అడుగంటాయి. వర్షాలు రావడం లేదు. దీంతో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. చెన్నైకి ప్రధాన నీటి ఆధారమైన పూండి, పుళ‌ల్, చోళ‌వ‌రం, చెంబ‌రంబాక్కం, రెడ్ హిల్స్, వీరాణం జ‌లాశ‌యాలు. ఇవి పూర్తిగా అడుగంటిపోయాయి. దీనికి తోడు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా మన ఏపీ నుంచి వెళ్లే కండ‌లేరు జిలాలు కూడా వానలు రాక పోలేదు. దీంతో నీటి స‌మ‌స్య మ‌రింత పెరిగిపోయింది. వీటన్నింటి కారణం  చెన్నైలోని నీటి ఎద్ద‌డి తీవ్ర‌త ఎంతంటే.. ఐటీ కంపెనీల్లోని క్యాంటీన్ల‌ను మూసేశారు. ఈ దారుణం అక్కడితో ఆగిపోలేదు. ప్ర‌తి ఒక్క ఉద్యోగి త‌న‌కు అవ‌స‌ర‌మైన నీటిని.. భోజ‌నాన్ని ఇంటి నుంచే తెచ్చుకోవాలట.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెద్ద పెద్ద హోట‌ళ్లు త‌మ మెనూలో భోజ‌నం ఎత్తేశాయి. నీరు అధికంగా అవ‌స‌ర‌మ‌య్యే ఆహార ప‌దార్థాల్ని వండ‌టం నిలిపేశారు. నీటి స‌మ‌స్య తీరే వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితిని కొన‌సాగిస్తామ‌ని స‌ద‌రు హోట‌ళ్లు చెప్పేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్ర‌భుత్వం పట్టించుకోవడం లేదట. ప్ర‌తిప‌క్షాలు మాత్రమే కాదు, ప్రజలు కూడా మండిపడుతున్నారు. నీటి కరవుపై స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని మ‌ద్రాసు హైకోర్టు పేర్కొంది. చివరకు 40 మిలియ‌న్ లీట‌ర్ల నీటిని జోలార్ పేట రైల్వేస్టేష‌న్ నుంచి చెన్నైకి పంపుతున్నారు. చెన్నైకు వెళ్లే వారు జాగ్రత్త. సోషల్ మీడియాలో కూడా #ChennaiWaterCrisis ట్రెండ్ అవుతోంది.