వైసీపీ బాటలో టీఆర్ఎస్ ఎంపీ- కేసీఆర్ చీవాట్లు

June 04, 2020

తెలంగాణ ఎంపీకి రంజిత్ రెడ్డికి ఈరోజు కేసీఆర్ తో చీవాట్లు తప్పేలా లేవు. సాయం పేరిట ఆయన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. ఎటువంటి సామాజిక దూరం నిర్వహించే ఏర్పాట్లు చేయకుండా కూరగాయలు, ఆహారం పంపిణీ చేపట్టిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అందరితో విమర్శల పాలయ్యారు. కేసీఆర్ ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది 

ఏపీలో విజయసాయిరెడ్డి ప్రతిరోజు వందలాది మందిని పోగేసి తన ఫౌండేషన్ ప్రచారం కోసం తాపత్రయ పడుతూ లాక్ డౌన్ నిబంధనలు తుంగలో తొక్కుతున్న విషయం తెలిసిందే. అదే దారిలో నడిచారు టీఆర్ఎస్ ఎంపీ. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో పేదలకు పంచడానికి వాహనాల్లో హైదరాబాదులోని హైటెక్ కన్వెన్షన్ సెంటర్ కి సరుకులు పంపిన ఎంపీ అక్కడ గందరగోళానికి కారణమయ్యారు. దీంతో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. ఇంకోసారి రిపీటయితే బాగుండదని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరితో తిట్లు తిన్నారు ఎంపీ.