చిదంబరం అరెస్టు - ఇవే హైలైట్స్

July 13, 2020

బీజేపీ పంతం నెగ్గింది. తనకు నచ్చని అవినీతి పరుడికి సంకెళ్లు వేసింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు 27 గంటల హైడ్రామా అనంతరం అరెస్ట్ చేశారు. కొన్ని గంటల ముందు కూడా పెద్ద ఎత్తున హడావుడి నడిచింది. సీబీఐ అధికారులు చిదంబరం గోడ దూకి సినిమా సీన్ ను తలపించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలోనే చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇది రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు తెలుసుకుందాం.

* చిదంబరం ఇంటి గేటు ఎంత్ బెల్ మోగించిన తీయకపోవడంతో అధికారులు గేట్లు దూకారు.
* ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
* చిదంబరాన్ని సీబీఐ అధికారులు తమ కారులో హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు.
* చిదంబరం తనకు అనారోగ్యానికి సంబంధించి మందులు తనతో ఉంచుకోవాలన్నా కూడా సీబీఐ అధికారుల అనుమతి కావాలిపుడు.
* ఆయన సుప్రీంకోర్టులో పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ ఇప్పుడు వృథా.
* అరెస్ట్ అయ్యారు కాబట్టి సీబీఐ కోర్టులో మళ్లీ కొత్తగా బెయిల్‌ను దరఖాస్తు చేసుకోవాలి.
* సీబీఐ కోరితే సీబీఐ కోర్టు ఆయన్ను 14 రోజుల కస్టడీకి ఇచ్చే అవకాశం లేకపోలేదు.
* సీబీఐ కస్టడీ ముగిశాక ఈడీ ప్రశ్నించే అధికారం ఉంది.
* ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్‌పై విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.
* ఒక అంచనా ప్రకారం... కనీసం 15 రోజుల పాటు ఆయను చిప్పకూడు తప్పదు అంటున్నారు.