పెళ్లికాని యువ‌కుల‌కు ప్ర‌భుత్వ వ‌రం... ' ల‌వ్ ఎక్స్‌ప్రెస్‌ '

August 08, 2020

పెళ్లికాని యువ‌కుల‌కు ప్ర‌భుత్వ‌మే బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. త‌మ‌కు న‌చ్చిన భాగ‌స్వామిని వెతుక్కునేలా ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. 1000 మంది యువ‌కులు, 1000 మంది యువ‌తుల‌ను ఓ ట్రైన్‌లో పెట్టేసి... అందులో జ‌ర్నీ చేసే క్ర‌మంలోనే త‌మ‌కు న‌చ్చిన అమ్మాయిని సెల‌క్ట్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఇంత‌కు ఈ ఆఫ‌ర్ మ‌న‌దేశంలో కాదు చైనాలో.. చైనాలో కొద్ది రోజులుగా యువ‌కుల‌కు పెళ్లిళ్లు కావ‌డం లేదు. చైనా కొన్ని ద‌శాబ్దాలుగా జ‌నాభాను నియంత్రించేందుకు త‌ల్లిదండ్రులు ఒక్క బిడ్డ‌తోనే స‌రిపెట్టుకోవాల‌న్న నిబంధ‌న విధించింది. దీంతో చాలా మంది ఒక్క అబ్బాయితోనే స‌రిపెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలోనే అక్క‌డ అమ్మాయిల కొర‌త తీవ్రంగా ఉంది. అబ్బాయిల‌కు పెళ్లిళ్లు కావ‌డం లేదు. కొంద‌రు ఇత‌ర దేశాల‌కు చెందిన అమ్మాయిల‌ను డ‌బ్బులు ఇచ్చి మ‌రీ కొనుక్కుని పెళ్లి చేసుకుంటున్నారు. అక్క‌డ ఒక్క అమ్మాయి ఉందంటే చాలు పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు ఎగ‌ప‌డుతుండ‌డంతో అమ్మాయిల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో చైనా ప్ర‌భుత్వ‌మే అబ్బాయిల‌కు పెళ్లి చేసేందుకు రంగంలోకి దిగింది. ల‌వ్ ఎక్స్‌ప్రెస్ అనే పేరుతో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది.

చైనాకు చెందిన 1000 మంది యువకులు, 1000 మంది యువతులకు ఒక ప్రత్యేక రైలులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ఈ ట్రైన్ జ‌ర్నీలోనే యువ‌కులు త‌మ‌కు న‌చ్చిన అమ్మాయిల‌ను సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. ఆ అబ్బాయిని చేసుకునేందుకు ఆ అమ్మాయికి ఇష్ట‌మైతే వారి పెళ్లి ఖాయ‌మైన‌ట్టే. ఈ ట్రైన్‌లో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. ఈ ట్రైన్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు 3 వేల మంది యువ‌తీ, యువ‌కులు ప్ర‌యాణించారు. వీరిలో కొంద‌రు ఇప్ప‌టికే పెళ్లి చేసుకోగా... మ‌రికొంద‌రు రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. 

ఈ ల‌వ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్ర‌యాణించాకే త‌న‌కు ఓ అమ్మాయి జీవిత భాగ‌స్వామిగా దొరికింద‌ని యంగ్ హు ఆన్ అనే యువ‌కుడు చెప్పాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిన చైనాలో 1970 నుంచి నియత్రణ విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కఠిన నిబంధ‌న‌ల కార‌ణంగానే అక్క‌డ ఇప్పుడు అమ్మాయిల కొర‌త తీవ్రంగా ఉంది.