భారతీయులకు, మోడీకి కోపం తెప్పించిన చైనా

July 04, 2020

కశ్మీర్ మన భూభాగం. ఇప్పటికే పీఓకే కోల్పోయినా... మనసు ఒప్పక దానిని కూడా మన మ్యాప్ లో చూసుకుని బాధపడుతున్నాం. అలాంటిది... మన సొంత కశ్మీర్ పై మనం చట్టాలు చేసుకుంటే... చైనా స్పందించిన తీరుపై భారతీయులు అంతా మండిపడే పరిస్థితి. భారత పార్లమెంటు సంపూర్ణంగా కశ్మీర్ విభజన బిల్లును ఆమోదించిన తర్వాత దీనిపై తాజాగా చైనా స్పందించింది.

‘‘కశ్మీర్‌ విషయంలో భారత్‌ తీరు తమ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉంది’’ అంటూ చైనా విదేశాంగశాఖ కార్యదర్శి ప్రకటించారు. అసలు తనకు ఎవరు మద్దతు ఇస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ చైనా ప్రకటనతో సంబరపడింది. ప్రపంచ దేశాలన్నీ ఈ నిర్ణయాన్ని భారత్ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటున్నాయి. వాస్తవం కూడా అదే. కాకపోతే పాకిస్తాన్ ను మచ్చిక చేసుకుని కశ్మీర్ పై కన్నేసిన చైనా తన సొమ్మేదో పోయినట్లు బాధపడుతోంది. అందుకే మన దేశంలో జరిగిన దానికి అది ఉలిక్కిపడింది.