అమెరికాకి కొత్త తలనొప్పి తెచ్చిన చైనా

August 09, 2020

కరోనా దెబ్బకు చైనా అంటే చాలు యావత్ ప్రపంచం వణుకుతోంది. ఆ దేశం నుంచి మొదలైన వైరస్ దెబ్బకు ఈ రోజు ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మానవాళి చరిత్రలో ఎప్పుడూ చూడని సరికొత్త సన్నివేశాలకు కరోనా కేరాఫ్ అడ్రస్ గా నడుస్తోంది. ఈ వైరస్ క్రియేట్ చేసిన విలయం నుంచి ఇంకా కోలుకోకముందే.. మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది.

చైనా నుంచి వచ్చాయని చెబుతున్న విత్తనాల ప్యాకెట్లు ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికాలో కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలీని వ్యక్తుల నుంచి వస్తున్న విత్తనాల పార్శిళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నాట వద్దని హెచ్చరిస్తున్నారు. విత్తనాల కవర్లను జాగ్రత్తగా దాచి పెట్టాలని.. తాము వాటిని తీసుకెళతామని అధికారులు ముందు జాగ్రత్తలు చెబుతుున్నారు.

దీంతో.. అమెరికాలో చైనా విత్తనాలుగా చెబుతున్న కవర్ల కలకలం కొత్త ఇష్యూగా మారింది. అమెరికాలోని పెద్ద నగరాలైన వాషింగ్టన్.. వర్జీనియా.. టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో పలు ఇళ్ల ఎదుట మొయిల్ బాక్సుల్లో విత్తనాల పాకెట్లతో కూడి కవర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో.. వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విత్తన పార్శిళ్లపై హోంల్యాండ్ సెక్యురిటీ విభాగంతో పాటు.. నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి.

ఈ విత్తనాల్ని నాటితే పర్యావరణం దెబ్బ తినే ప్రమాదం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలోని కొత్త కలకలం మీద చైనా స్పందించింది. తమ దేశంలోని తపాలా వ్యవస్థ ప్రతి విషయంలోనూ కచ్ఛితమైన రూల్స్ ను పాటిస్తుందని.. కవర్ల మీద చైనా భాషలో ఉంటే మాత్రం ఇలాంటి దుష్ప్రచారం చేయటం సరికాదంటున్నారు.

చూస్తుంటే.. ప్రపంచానికి చైనా పేరు వినిపిస్తే చాలు.. హడలిపోయే పరిస్థితి నెలకొందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారుతోంది. భయానికి బ్రాండ్ అంబాసిడర్ గా చైనాకు మించినోళ్లు మరెవరూ ఉండరేమో?

Read Also

పెళ్లి నాతో, కాపురం నా ఫ్రెండుతో - షాకిచ్చిన ఎన్నారై వరుడు
కాలిఫోర్నియా... ఈ ఫొటో మీకు కోపం తెప్పిస్తుంది
అమెరికా ఫ్రీ సీటు గెలిచిన తెలంగాణ అమ్మాయి