ఇక ప్రధానులతో కాదని, నడుంబిగించిన చినజీయర్

August 04, 2020

లాక్ డౌన్లు పెట్టారు

భౌతిక దూరం అన్నారు

మాస్కు పెట్టుకోమన్నారు. 

ఏమీ పనిచేయడం లేదు. ఇవేవీ ఆపడం లేదు. ఇక నా ప్రయత్నం నేను చేస్తాను అంటున్నారు శ్రీ చినజీయర్ స్వామి. మానవాళి మొత్తం కరోనా బారిన పడి తమ ఆర్థిక అస్తిత్వాన్నే కోల్పోతున్న తరుణంలో మహమ్మారి నుంచి బయటపడేందుకు  మనుషులు చేస్తున్న ప్రయత్నాలు చాలడం లేదు. నేను దేవుడ్ని సాయం అడుగుతాను అంటున్నారు చినజీయర్ స్వామి.

కరోనా మహమ్మారి నివారణ కోసం చినజీయర్ స్వామి శ్రీరామ జపం, హనుమత్‌ పారాయణం చేస్తున్నట్లు ఆయన ప్రతినిధులు వెల్లడించారు. హనుమంతుడు సంజీవని తెచ్చి లక్ష్మణ, వానరసైన్యం ప్రాణాలు కాపాడినట్లు త్వరగా ఈ వైరస్‌కు వ్యాక్సిన్ రావాలని ... ప్రజలంతా మునుపటి జీవితం గడపాలని కోరుతూ ఈ జపం, పారాయణం చేస్తున్నారట.

శ్రీరామ, హనుమత్‌ పారాయణంతో పాటు చినజీయర్‌ స్వామి 40 రోజుల పాటు మండల దీక్ష చేస్తారు. ఈ దీక్ష గురు పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో జరుగుతోందని ఆశ్రమ ప్రతినిధులు తెలిపారు.