దుమ్మురేపుతున్న ఇండియన్ ‘టిక్ టాక్‘

August 10, 2020

భారత ప్రభుత్వం చైనా యాప్స్ ను నిషేధించిన విషయం తెలిసిందే. నిషేధించిన యాప్స్ లో కొన్ని యాప్స్ ఇక్కడ విపరీతంగా పాపులర్. అందులో ముఖ్యంగా టిక్ టాక్ యాప్. ఈ యాప్ వాడని అమ్మాయిలు చాలా తక్కువ. ఇది ఎన్ని జీవితాలను పాడు చేసిందో లెక్కే లేదు. ప్రభుత్వ ఈ యాప్ ను బ్యాన్ చేయడం పట్ల లక్షల మంది తల్లిదండ్రులు, భర్తలు సంతోషంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 

అయితే... ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. టిక్ టాక్ యూజర్లను అలరించడానికి కొత్త యాప్ మార్కెట్లో ఆల్రెడీ రెడీగా ఉంది. అదే చింగారీ యాప్.  టిక్ టాక్ పై పోరాటం జనాల్లో  మొదలైనపుడే ఇది పాపులర్ అయిపోయింది. ఇటీవల చాలా వేగంగా డౌన్లోడ్లు పెరిగాయి. టిక్ టాక్ కు పోటీ ఇచ్చే యాప్ లు ఎన్నో వచ్చినా చివరకు చింగారీ నిలబడిందని చెబుతున్నారు. టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ యాప్ కు విశేష ఆదరణ లభిస్తోందట. ప్రస్తుతం పాతిక లక్షల డౌన్లోడ్లు అయ్యాయి ఈ యాప్ కి.

గాల్వన్ ఉదంతం తర్వాత డౌన్ లోడ్లు మరింత పెరిగాయట. మరి రాత్రి ప్రభుత్వం బ్యాన్ చేసిన నేపథ్యంలో దీనికి భారీగా ఆదరణ దక్కే అవకాశం మెండుగా కనిపిస్తోంది.  స్వదేశీ పరిజ్ఞానంతో చంటిగాడు లోకల్ అన్నట్లుగా దూసుకొచ్చిన ఈ చింగారి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. 

దీని క్రియేటర్లు బిస్వాత్మా.. సిద్దార్థ్ లు.  కొద్ది రోజుల క్రితం కేవలం 72 గంటల్లో 5 లక్షల డౌన్ లోడ్లు అయ్యాయంటే నమ్ముతారా? అంత పాపులర్ అయిపోతోంది.  ఈ యాప్ లో కొన్ని ప్రత్యేకతలు ఆకట్టుకుంటున్నాయి. చాటింగ్ చేసుకోవచ్చు. అలాగే వ్యూస్ ఆధారంగా పాయింట్లు వస్తాయి. పాయింట్లను డబ్బుగా మార్చుకోవచ్చు.