చిరంజీవి అవసరం లేని తాపత్రయం - జగన్ కోసం ఆరాటం

February 19, 2020

చిరంజీవి... అతను సినీలోకంలో ఒక మహా ధృవతార. అప్రతిహతమైన ప్రతిష్టను సంపాదించాడు. నవరస నటనా ప్రతిభతో సినీ దేవుడిగా ఎదిగాడు. కానీ రాంగ్ టైమ్ లో రాజకీయంలో అడుగులుపెట్టారు. అయితే, తను సినిమాల్లో మెల్లగా ఎలా ఎదిగిందీ మరిచిపోయి... ఒకేసారి అందలం ఆశించారు. అందలం ఆశించడంలో ఏ తప్పులేదు. కానీ ఒక మెగాస్టార్ కావడానికి ఏ లక్షణాలు అవసరమో నేర్చుకున్న చిరంజీవి, ఒక రాజకీయ నాయకుడు కావడానికి ఏ లక్షణాలు అవసరమో మాత్రం గ్రహించలేకపోయారు. చివరకు అనేక మలుపుల అనంతరం ఆ పార్టీ మూతపడింది. రాజకీయ నేత చిరంజీవి, మళ్లీ మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. సైరా అంటూ... తన రికార్డుల గురించి మళ్లీ కాలుదువ్వాడు. సైరా విజయంతో సంతోషంలో మునిగితేలుతున్న చిరంజీవి... ప్రముఖులను కలుస్తున్నారు. 

తాజాగా జగన్ అపాయింట్ మెంట్ కూడా అడిగారు. 14వ తేదీ అపాయింట్మెంట్ ఫిక్సయినట్టు తెలిసింది. అయితే... ఇక్కడ అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అసలు చిరంజీవికి జగన్ని కలవాల్సిన అవసరం ఇపుడు ఏంటి?

తన సినిమా ఎలా తీసింది వివరించాల్సిన అవసరం ఏమిటి?

విడుదలకు ముందు అయితే... ఏదైనా పన్నుమినహాయింపుకేమో అనుకోవచ్చు కానీ విడుదలైన ఇన్నాళ్ల తర్వాత దానికోసం కలుస్తున్నారా?

సీఎం హోదాలో తనను తాను ఊహించుకున్న వ్యక్తి... ఇపుడు తన తమ్ముడు తీవ్రంగా వ్యతిరేకించే జగన్ రెడ్డిని కలవడంలో ఔచిత్యం ఏమిటి?

ఒక సినిమా చూడమని జగన్ ని కోరనున్నారా?.. అలా అయితే... జగన్ చూడాల్సిన అవసరం, జగన్ మెప్పు చిరంజీవికి ఎందుకు? 

ఏది ఏమైనా... తాము చక్రం తిప్పే సామాజిక వర్గంగా భావిస్తున్న చిరంజీవి సామాజిక వర్గం... జగన్ అపాయింట్ మెంట్ కోసం చిరంజీవి తాపత్రయపడటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. 

Read Also

టీవీ9 లో విజయసాయిరెడ్డి స్లీపింగ్ పార్ట్ నర్ ?
పచ్చి మోసం... పెద్ద డ్రామా !!
పాలన గురించి జగన్ అభిమాని పోల్ పెడితే ఏమైందో తెలుసా?